Jaggery: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి?
ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఏడు మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బులు నిలబడడం లేదని, కష్టపడి సంపాదించిన డబ్బు అంతా పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వస్తుంది అంటూ బాధపడుతూ ఉంటారు.
అయితే కొంత మంది రేయి పగలు ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బు నిలవడం లేదని ఎక్కువగా సతమతమవుతూ బాధపడుతూ ఉంటారు. డబ్బు సమస్యతో బాధపడే వరకు కొన్ని విషయాలను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెల్లం కేవలం వంటల్లో మాత్రమే కాకుండా మనిషి జీవితాన్ని కూడా మరింత తీపిగా చేస్తుంది. అదెలా అంటే జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే అటువంటివారు ప్రతిరోజు కొంచెం బెల్లం నీటిని తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించాలి. దీంతో పాటుగా ఆదివారం ఎనిమిది రోజులపాటు ఆలయానికి వెళ్లి 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లం సమర్పించాలి. విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఎర్రటి గుడ్డలో నాణెంతో కట్టి, ఆ తరువాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ప్రతిరోజు పూజను చేయాలి.
అలా ఐదవ రోజు దుర్గాదేవిని పూజించిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకొని వెళ్లి అల్మారాలో పెట్టండి. లేదా మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచడం వల్ల డబ్బు కొరత సమస్యను అధిగమించవచ్చు. అలాగే ఐశ్వర్యం, సంపద, ధాన్యం, ఆనందం కోసం గురువారం రోజు ఆవుకి శనగపిండితో కలిపి బెల్లం తినిపించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. అదేవిధంగా కొంతమంది ఎన్ని ఉద్యోగాలకు వెళ్లిన ఫెయిల్ అవుతూ ఉండడంతో మదన పడుతూ ఉంటారు. అటువంటి వారు ప్రతి రోజు అన్నంతో పాటు కొంచెం బెల్లం ను కలిపి ఆవుకి తినిపించాలి. ఈ విధంగా చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి..
0 Comments:
Post a Comment