బీజేపీకి బిగ్ షాక్: టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్..?, డిప్యూటీ సీఎం పదవీ ఆఫర్
మునుగోడు బై పోల్ రిజల్ట్ కూడా వచ్చింది. అక్కడ గులాబీ జెండా ఎగిరింది. మరీ బీజేపీ సంగతి ఏంటీ.. అంతా బానే ఉందని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీ నేతలు..
తిరిగి పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే అదీ అగ్రనేతకు సంబంధించి ఊహాగానాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ డైలీ.. దెక్కన్ క్రానికల్ ఓ కథనమే రాసింది. అదే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి చేరబోతున్నారని రాసింది. ఇందులో నిజ నిజాలు ఏమో కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చకు దారితీసింది.
ఘర్ వాపసీ, ఈటల బ్యాక్ టూ
టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టారని తెలిసింది. అందులో భాగంగానే ఈటల రాజేందర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ కథనంలో రాసింది. బీజేపీకి రాష్ట్రంలో చోటు ఉండొద్దని అనుకుంటున్నారు. ఆ మేరకు ప్రణాళిక రచించి, ముందడుగు వేస్తున్నారు. తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరితే.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవీ ఇస్తారట.. దానికి ఈటల రాజేందర్ మాత్రం నో చెప్పలేదట.
బీజేపీకి నో ఛాన్స్
మునుగోడు బై పోల్ తర్వాత సీఎం కేసీఆర్ వైఖరి మారిందని ఓ టీఆర్ఎస్ సీనియర్ నేత అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దని ఆయన భావిస్తున్నారట. అందుకే బీజేపీకి కోలుకోలేని షాక్ ఇవ్వబోతున్నారు. సొంత పార్టీ నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీలకు వెళ్లిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ నేతలకు వల వేస్తే.. వారిని తనవైపు తిప్పుకునేందుకు గులాబీ దళపతి ప్రయత్నిస్తున్నారట.
ఈటలతో సంప్రదింపులు..?
మునుగోడులో బీజేపీ ఓడిపోయిందని.. మళ్లీ ఎన్నిక వరకు బీజేపీ కోలుకోలేదనే ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే ఈటలతో సీఎం కేసీఆర్ తన అనుయాయులతో సంప్రదింపులు జరిపారట. తిరిగి పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవీ ఇస్తామని చెప్పారట. ఈటల కూడా తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ఒకింత ఇష్టంగానే ఉన్నారని తెలిసింది. ఈటలతో సంప్రదింపులకు సంబంధించిన విషయం బీజేపీ రాష్ట్ర అగ్రనేతలకు కూడా తెలుసని ఆ కథనంలో రాసుకొచ్చింది.
ఇప్పుడే కాదు, గతంలో కూడా
ఈటల రాజేందర్ తిరిగి బీజేపీలో చేరరని ఆ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. తిరిగి పార్టీలోకి వెళితే అతని పేరు ఏమవుతుందని అన్నారు. అతను కేసీఆర్, టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మరో బీజేపీ నేత మాత్రం మునుగోడులో జరిగిన పోరాటం తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టిందని తెలిపారు. ఈ ప్రచారం ఇప్పుడే కాదు.. హుజురాబాద్ ప్రచారం చేసే సమయంలో తమలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవీ ఇస్తారనే ప్రచారం జరిగిందని తెలిపారు. కానీ తమ పార్టీ నేతలు ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగరని వివరించారు. చేరికల అంశంపై టీఆర్ఎస్ నేత, ఎంపీ కూడా స్పందించారు. రాజేందర్ చేరికకు సంబంధించిన అంశం నిజం కాదని తెలిపారు. తాము అలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. తమకు నేతలు ఉన్నారని.. బీజేపీకే కొరత ఉందని తెలిపారు.
ఓహ్ నో.. చేరేదీ లేదు: ఈటల
చేరికపై ఈటల రాజేందర్ వెర్షన్ కూడా డీసీ తీసుకుంది. అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. మునుగోడులో డబ్బులు ఖర్చు చేసి,ఈసీని మానేజ్ చేసి, పోలీసులను దుర్వినియోగం చేసి మరీ గెలిచారని తెలిపారు. ఇప్పుడు కావాలనే తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీలో తాను ఎదగకుండా.. పార్టీ బలపడకుండా చేసే యత్నం ఇదీ అని కొట్టిపారేశారు. రాజేందర్ తిరిగి టీఆర్ఎస్‌లో చేరిక గురించి బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఖండించాయి. మరీ నిప్పులేనిదే పొగ ఎలా వచ్చినట్టు అనే నానుడి గుర్తుకొస్తోంది. ఘర్ వాపసీ పేరుతో.. పదవీ ఆఫర్ చేయకుంటే ఎలా తెలిసిందని మరికొందరు అంటున్నారు.
0 Comments:
Post a Comment