IIIT: మూడో విడత కౌన్సెలింగ్ తేదీ ఇదే..
ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితాను 9న వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. గత రెండు విడతల్లో ఎంపికై చేరకుండా ఉన్న అభ్యర్థులకు ఆసక్తి ఉంటే మూడో విడత కౌన్సెలింగ్‌లో హాజరవ్వచ్చని, దీనికి గాను వర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ఎవరైనా ప్రస్తుతం చేరిన ట్రిపుల్ ఐటీ నుంచి మరో ట్రిపుల్ ఐటీకి మారాలనుకునే వారు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింకులో నమోదు చేసుకోవాలన్నారు. మరొక ట్రిపుల్ ఐటీకి మార్చిన తరువాత తప్పనిసరిగా అక్కడకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌లను నవంబర్ 6న సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని కోరారు.
0 Comments:
Post a Comment