Hyper Tower: ప్రపంచంలో అతి ఎత్తైన భవనం బూర్జ్ ఖలిఫా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే కాదు, వింతగొల్పే, ఔరా అనిపించే ఎన్నో కట్టడాలకు దుబాయ్ కేరాఫ్ అడ్రస్.
అలాంటి దుబాయ్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనాన్ని నిర్మించబోతున్నట్లు దుబాయ్ ప్రకటించింది.
హైపర్ టవర్ పేరుతో నిర్మించనున్న వంద అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తైనట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.
ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ 'బింఘట్టి', ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ 'జాకోబ్ అండ్ కో' సంయుక్తంగా ఈ హైపర్ టవర్‌ను నిర్మిస్తున్నాయి. దీనికి బూర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం కూడా చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగానే కాదు, అత్యంత విలాసవంతమైన భవనంగా కూడా ఇది రికార్డుకెక్కనుంది. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత.
రాత్రిపూట మిరుమిట్లు కొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో నిర్మించనున్నారు.
ఇక చివరి అంతస్తులో అత్యంత విలాసవంతమైన పెంట్ హౌజ్‌లు ఏర్పాటు చేస్తున్నారట. ఇవే కాకుండా ఈ భవనంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట.
అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ 57వ వీధిలో ఉన్న సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది.
ఈ భవనంలో 98 అంతస్తులు ఉన్నాయి. ఈ భవనం ఎత్తు 472 మీటర్లు. అయితే దీన్ని హైపర్ టవర్ అధిగమించనుంది.
0 Comments:
Post a Comment