నకిలీలను ఏరివేసే కార్యక్రమం పేరుతో రేషన్ కార్డులు, ఓటరు కార్డులను తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ(Telangana)లోని కీలక జిల్లాగా ఉన్నటువంటి హైదరాబాద్(Hyderabad) జిల్లా పరిధిలో మునుపెన్నడు లేనంతగా ఓటర్ల జాబితా నుంచి రెండున్నర లక్షలకుపైగా పేర్లను తొలగించారు అధికారులు.
జిల్లాలో మొత్తం 15అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఇందులో 2.79లక్షల మంది పేర్లను తొలగించినట్లుగా జీహెచ్‌ఎంసీ(GHMC) విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఉంది.
అయితే ఈ తొలగించిన 2.79లక్షల ఓట్లలో జూబ్లిహిల్స్(Jubilee Hills)నియోజకవర్గ పరిధిలోనే ఉండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రికార్డు స్థాయిలో ఓట్ల తొలగింపు..
నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో అధికారులు హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా నుంచి 2.79లక్ష మంది పేర్లను తీసేశారు. గతంలో ఎప్పుడూ ఇంత మంది పేర్లు తొలగించిన దాఖలాలు లేవు. అయితే తొలగించిన వాళ్ల సంగతి ఇలా ఉంటే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల సంఖ్య మాత్రం తొలగించిన వాటిలో ఐదో వంతు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 15నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గతేడాది ఓటర్ల జాబితా ప్రకారం 43.67లక్షల ఓటర్లు ఉండగా అందులోంచి 2.79మంది తొలగించగా 41.46లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా బుధవారం జీహెచ్‌ఎంసీ ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
కొత్తగా ఓటు కోరుకునే వారు తక్కువే..
గ్రేటర్ హైదరాబాద్‌కి కీలకంగా ఉన్న హైదరాబాద్ జిల్లాలోనే ఇన్ని పేర్లు తొలగించడంపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో అధికారులు మాత్రం అందుకు నకిలీ ఓట్లు ఎక్కువగా ఉండడమే కారణమంటున్నారు.
ఇందులో ఎక్కువగా జూబ్లిహిల్స్‌లో 25వేల 591 పేర్లు తొలగించగా.యాకత్‌పూరాలో 27,341,మలక్‌పేటలో 25,029,చార్మినార్‌లో 11,017 ఓట్లు తొలగించారు. అత్యల్పంగా గోషామహల్ నియోజకవర్గ పరిధిలో 10,107 ఓట్లు తొలగించడం విశేషం.
డిసెంబర్ 8వ తేది డెడ్ లైన్ ..
తొలగించిన ఓటరు పేర్లలో ఎవరికైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే డిసెంబరు 8వ తేదీలోపు తెలపాలని జీహెచ్‌ఎంసీ కోరింది. పోలింగ్ కేంద్రాలు, సర్కిల్, జోనల్ కార్యాలయాల వద్ద ఈ జాబితాను అందుబాటులో ఉంటుంది. నకిలీ ఓట్లను వడపోసే క్రమంలోనే ఈ ప్రక్రియ జరగుతోంది.
2023 జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు అధికారులు. ఇక కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్లు 60వేల మంది ఉంటే కార్వాన్‌లో 7,922 టాప్ ప్లేస్‌లో ఉన్నారు. యాకత్‌పురాలో 7,503, సికింద్రాబాద్‌లో 1,716 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తక్కువ సంఖ్యలో ఓటరు నమోదు చేసుకుంది కంటోన్మెంట్‌లో కేవలం 908 కొత్త దరఖాస్తులు చేసుకున్నారు.
హైదరాబాద్‌లోనే అధికం..
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. యాకత్‌పురా, మలక్‌పేట, కార్వాన్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, చార్మినార్, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో 1,36,286 ఓట్లు తొలగించారు.
ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారి పేర్లు తొలగించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల పేర్లూ తొలగించారు. నకిలీ ఓట్లు 2.75 లక్షలకుపైగా ఉండగా, చిరునామా మారిన 3,966, చనిపోయిన 78 మంది ఓట్లు తొలగించారు. కొందరి ఓట్లను ప్రస్తుతం ఉంటు న్న ఏరియాలో తొలగించడంతో వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇకపై ఏడాదిలో నాలుగు సార్లు ఛాన్స్..
గతంలో ఓటరు నమోదు చేసుకోవడానికి జనవరి 1వ తేది నాటికి 18ఏళ్లు నిండితే ఓటు హక్కు నమోదు చేసుకునే ఛాన్సుండేది. కాని ఏడాది నుంచి నాలుగు కటాఫ్ తేదీలను ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. జనవరి 1తోపాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటరు జాబితాలో తమ పేర్లు నమో దు చేసుకోవచ్చ రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.
0 Comments:
Post a Comment