How much gold can be in the house? What are the restrictions and IT regulations?
ఇంట్లో ఎంత వరకు బంగారం ఉండొచ్చు? పరిమితులు, ఐటీ నిబంధనలు ఏం చెప్తున్నాయ్.
బంగారం.. దీని విలువ ఒక్కటే కాలంతో సమానంగా పెరుగుతూ వస్తున్నది. భౌతిక రూపం దగ్గర్నుంచి బాండ్లు, డిజిటల్, ఎస్‌జీబీలు ఏదైనాసరే పుత్తడి కొనుగోలుకున్న ప్రత్యేకతే వేరు.
ముఖ్యంగా పండుగ రోజుల్లో పసిడి కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు భారతీయులంతా. అయితే గోల్డ్ ఏ రూపంలో ఉన్నా దాని నిల్వకు మాత్రం కొన్ని నిబంధనలు, పరిమితులు, పన్నులు ఉన్నాయి.
బంగారం.. దీని విలువ ఒక్కటే కాలంతో సమానంగా పెరుగుతూ వస్తున్నది. భౌతిక రూపం దగ్గర్నుంచి బాండ్లు, డిజిటల్, ఎస్‌జీబీలు ఏదైనాసరే పుత్తడి కొనుగోలుకున్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పండుగ రోజుల్లో పసిడి కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు భారతీయులంతా. అయితే గోల్డ్ ఏ రూపంలో ఉన్నా దాని నిల్వకు మాత్రం కొన్ని నిబంధనలు, పరిమితులు, పన్నులు ఉన్నాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), స్టాక్ మార్కెట్లు కాకుండా ఇప్పుడు బంగారంపైనా పెట్టుబడులు పెరిగిపోయాయి మరి.
డిజిటల్ గోల్డ్
భౌతిక బంగారంతో పోల్చితే డిజిటల్ గోల్డ్ అనేది ఎప్పటికీ ఉత్తమ పెట్టుబడిగానే భావించవచ్చు.
lడిజిటల్ గోల్డ్‌లో మదుపు చేసేటప్పుడు కొన్న ధరపై జీఎస్టీని మాత్రమే చెల్లిస్తాం. ఇక ఇతరత్రా చిన్నచిన్న చార్జీలు మీ పెట్టుబడి తీరుపై ఆధారపడి ఉంటాయి.
డిజిటల్ గోల్డ్‌ను ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. అయితే ఒక్కరోజులో రూ.2 లక్షలకు మించి కొనరాదు.
కొనుగోలు చేసిన మూడేండ్లలోపు డిజిటల్ గోల్డ్‌ను అమ్మితే వచ్చే ఆదాయంపై నేరుగా ఎటువంటి పన్నుండదు.
కొన్న మూడేండ్ల తర్వాత డిజిటల్ గోల్డ్‌ను అమ్మేస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది. విలువలో 20 శాతం పన్నుతోపాటు సెస్సు, సర్‌చార్జీలు పడుతాయి.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ)
ఎస్‌జీబీల్లో పెట్టుబడికి ఉన్న గరిష్ఠ పరిమితి వ్యక్తులకైతే ఏటా 4 కిలోలు.
సెకండరీ మార్కెట్ నుంచి కొన్నవైనా, ప్రభుత్వం జారీ చేసినవైనా ఏవైనాసరే ఈ పరిమితిని దాటరాదు.
అయితే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా తాకట్టుగా ఉండే హోల్డింగ్స్‌కు ఈ పరిమితి వర్తించదు.
సావరిన్ గోల్డ్ బాండ్ల కొనుగోళ్లపై జీఎస్టీని చెల్లించనక్కర్లేదు.
ఎస్‌జీబీపై ఏటా 2.5 శాతం వడ్డీరేటు ఉంటుంది. అయితే ఈ ఆదాయం పన్ను పరిధిలోకే వస్తుంది.
ఎస్‌జీబీలను కొన్న ఎనిమిదేండ్ల తర్వాత పొందే లాభాలకు పన్ను వర్తించదు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మూడేండ్లు దాటితే వాటిపై వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది. విలువలో 20 శాతం పన్ను, 4 శాతం సెస్సు పడుతుంది.
మొదటి మూడేండ్లు ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై మీ ఐటీ శ్లాబు ప్రకారం పన్నులు వర్తిస్తాయి.
వేర్వేరు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలకు రకరకాల ఖర్చులు,కనీస-గరిష్ఠ పరిమితులు, కాలవ్యవధులుంటాయి. పెట్టుబడికి ముందే వీటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలి.
పరిమితులు, ఐటీ నిబంధనలు ఏం చెప్తున్నాయ్
భౌతిక బంగారం
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తమ అధికారులకు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం..పైండ్లెన మహిళ వద్ద 500 గ్రాములు, పెళ్లికాని ఆడవారు 250 గ్రాములు, పెండ్లితో సంబంధం లేకుండా పురుషులు 100 గ్రాములదాకా నగలు ఉంచుకోవచ్చు.
ఐటీ సోదాల్లో ఈ మేరకు ఆభరణాలు దొరికితే సీజ్ చేయవద్దు.
భౌతిక బంగారాన్ని కొన్న మూడేండ్లలోపు అమ్మితే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను పడుతుంది. ఆతర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.
స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును పన్ను సహిత ఆదాయంపై వేసేదిగానే భావిస్తారు. దీన్ని ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబుల రేట్ల ప్రకారం విధిస్తారు.
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అనేది అమ్ముకున్న బంగారం విలువలో 20 శాతంగా ఉంటుంది. దీనికి 4 శాతం సెస్సు అదనం. అవసరమైతే అదనపు సర్‌చార్జీ ఉంటుంది.
భౌతిక రూపంలో బంగారం కొనేటప్పుడు దాని విలువలో 3 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)గా చెల్లిస్తామన్నది తెలిసిందే.
నగలు కొనడంపెట్టుబడేనా?
నిజానికి దేశంలో బంగారం అనేది ఇప్పుడు భౌతిక రూపంలో నగలుగానే పెద్ద మొత్తంలో ఉన్నది. అయితే పసిడిలో పెట్టుబడికి ఇది సరైన పద్ధతి కాదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆభరణాలు కొనేటప్పుడు తయారీ ఖర్చులు, జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. ఆపై నిల్వ, బీమా, ఏజెంట్ కమిషన్ల వంటి వ్యయాలు ఉండనే ఉంటాయని ఇదంతా మదుపరులకు లాభదాయకం కాదని వివరిస్తున్నారు.
0 Comments:
Post a Comment