High Court - జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్-రుషికొండ తవ్వకాలపై కేంద్ర సర్వేకు ఆదేశం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖలో రుషికొండపై ప్రభుత్వం చేపట్టిన తవ్వకాల ప్రక్రియపై గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రుషికొండపై గతంలో అనుమతిచ్చిన పరిధిని మించి తవ్వకాలు జరిపిన ప్రభుత్వం ఆ విషయాన్ని హైకోర్టులో అంగీకరించింది. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
విశాఖలో రుషికొండను సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కోసం భారీగా తవ్వుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.దీనిపై విచారణ జరిపిన హైకోర్టుకు ప్రభుత్వం గతంలో పర్యాటక ప్రాజెక్టు కూల్చివేసిన స్ధలంలోనే తవ్వకాలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కానీ అంతకు మించి తవ్వకాలు చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తవ్వకాల స్ధలాన్ని పరిశీలిచేందుకు వెళ్లిన విపక్ష పార్టీల నేతల్ని ప్రభుత్వం అడ్డుకుంది. చివరకు హైకోర్టులో అదనంగా తవ్వకాలు జరిపినట్లు ఇవాళ అంగీకరించింది.
ఇవాళ రుషికొండ తవ్వకాలపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. సర్వే చేయాలని సర్వే బృందానికి ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై సర్వే చేపట్టాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు జరిపారో సర్వే చేయాలని ఆదేశించింది. అనుమతికి మించి ఎంతమేత భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఈ సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment