చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కు కూడా హాస్పటల్ కు వెళ్లడం అంత మంచిది కాదు. అయినా కొన్ని అనారోగ్య సమస్యలను ఇంటి దగ్గరే సులువుగా తగ్గించుకోవచ్చు.
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు భిన్నమైన సాంప్రదాయాలను పాటిస్తున్నప్పటికీ.. కొన్ని రకాల ఆహరాలను మాత్రం సేమ్ తీసుకుంన్నారు. వాటిలో కొత్తిమీర విత్తనాలు లేదా ధనియాలు ఒకటి.
ధనియాలను నిత్యం ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఈ ధనియాలను జస్ట్ మసాలా దినులుగానే చూడకూడదు. ఎందుకంటే ఈ గింజల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి.
వీటిలో ఉండే ఎన్నో పదార్థాలు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. అధిక కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. అంతేకాదు చర్మం, జుట్టు సమస్యల నుంచి బయటపడేస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. ధనియాలో బయోయాక్టివ్ ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి, అలసట, మైగ్రేన్ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
దీనిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ధనియాలను ప్రతిరోజూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ధనియాలను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ధనియాల నీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
కొత్తిమీర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విష కణాలను నాశనం చేస్తాయి. గుండె జబ్బులు,స్ట్రోక్, క్యాన్సర్, శ్వాస సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, పార్కిన్సన్స్ మొదలైన సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆఫ్రికాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధనియాలు ఆందోళన, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే నిద్రలేమి ఇతర నిద్ర రుగ్మతలు తగ్గిపోతాయి. ధనియా నీరు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఆందోళనకు కారణమయ్యే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యను తొలగిస్తుంది.
ధనియా నీటిని తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. శరీరం వేడిగా ఉంటే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. ఒక రకంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది.
ఇలాంటి సమయంలో ధనియా నీటిని తాగితే బాడీ చల్లబడి హాయిగా నిద్ర పడుతుంది. అలాగే ఇది మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తుంది. అంతేకాదు గ్యాస్ట్రిక్ ఆమ్లత్వం నుంచి ఉపశమనం కలిగిస్తుంది కూడా.
ధనియాల్లో ఉండే ఐరన్ కంటెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎన్నో రకాల చర్మ సమస్యలను తొలగిస్తాయి. చికాకును తగ్గిస్తాయి.
దీనిలో ఉండే విటమిన్లు జుట్టు సమస్యలు ఎక్కువ కాకుండా చూస్తాయి. ఈ వాటర్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొత్త జుట్టు పెరుగుతుంది. ధనియాలను తలకు అప్లై చేసే నూనెతో కలిపి తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం రాదు.
ధనియా నీటిని ఎలా తయారు చేయాలి?
ధనియా నీటిని తయారు చేయడం చాలా సులువు. రెండు కప్పుల నీళ్లు తీసుకుని ఒక పాత్రలో పోసి అందులో ఒక చెంచా ధనియా గింజలు వేసి బాగా మరిగించాలి.
ఈ నీరు సగానికి తగ్గించినప్పుడు.. రెండు గ్లాసుల నీరు ఒక గ్లాస్ కాగానే స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలి.
ఈ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా తాగండి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ధనియా నీటిని తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలో ఈ నీటిని ఉదయం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
0 Comments:
Post a Comment