Health tips షుగర్ పేషెంట్లకు నడక చాలా మంచిది? ఏ సమయంలో నడవాలంటే..?
షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి నడక చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందుకోసం కొన్ని సమయాల్లో ఖచ్చితంగా నడవాలని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధ్యానం చేయాలి. యోగ చేయాలి. టైం ప్రకారమే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. మధుమేహులు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. షుగర్ పేషెంట్లు ఉదయం వాకింగ్ చేయడం, శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహుల ఆరోగ్యానికి నడక మంచి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మధుమేహులు ఉదయం నడక కంటే సాయంత్రం, మధ్యాహ్నం తర్వాత నడకతో పాటు శారీరక శ్రమచేస్తే మంచిది. మధ్యాహ్నం, సాయంత్రం వేలల్లో వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఉదయం పూట వ్యాయామం చేయడం కంటే సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుందట. ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్న కణాలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకూడదంటే.. సాయంత్రం పూట ఎక్కువ శారీరక శ్రమ చేయాలి. ఎక్కువ సేపు నడవాలి. ముఖ్యంగా పొద్దంతా కూర్చునేవాళ్లు సాయంత్రం పూట ఎక్కువగా నడవాలని నిపుణులు సలహానిస్తున్నాయి. రోజంతా కూర్చోవడం, పడుకోవడం, తినడం, కాలేయ కొవ్వు సమస్యలున్న వారు, ఇన్సులిన్ కు నిరోధకత ఉన్నవారు తప్పకుండా సాయంత్రం పూట వ్యాయామం చేయాలని పరిశోధనలో తేలింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మితమైన, తీవ్రమైన శారీరక శ్రమ చేసిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇది 18 శాతం తక్కువగా ఉంటుందట. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య వ్యాయామం చేసే వారిలో 25 శాతం తక్కువగా ఉంటుందట. సుమారు 56 ఏండ్ల వయస్సున్న 775 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
రోజంతా కూర్చుని పనిచేసే వారి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే డయాబెటీస్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు మధ్య మధ్యలో నడుస్తూ ఉండాలి. ఇలాంటి వారు ఉదయం పూట ఖచ్చితంగా నడవాలి. వ్యాయామం చేయాలి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం మాత్రమే వ్యాయామం చేస్తుంటారు. ఆ తర్వాత పొద్దంతా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. సాయంత్రం పూట వ్యాయామం చేస్తేనే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నడక ఎప్పుడు ఉత్తమమైనది?
మధుమేహులు మధ్యాహ్న భోజనం తర్వాత 5 నుంచి 10 నిమిషాలపాటు నడవడం మంచిది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కూడా మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, సాయంత్రం పూట వ్యాయామం చేయడం, లంచ్, డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment