సగ్గుబియ్యంతో పాయసం, వడ.. ఇలా కొన్ని రకాల వంటకాలు తయారుచేయడం మనకు తెలుసు. ఇది రుచిలోనే కాదు.. పోషకాలలోనూ మిన్నే! ఇంతకీ వీటిలో ఉండే పోషకాలేంటో తెలుసుకుందామా?
⚛ శాకాహారం తినేవారికి శరీరానికి తగినన్ని మాంసకృత్తులు అందవు. ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోండి. వాటిల్లోని మాంసకృత్తులు శక్తినివ్వడమే కాదు.. కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
⚛ సగ్గుబియ్యంలోని పిండిపదార్థాలు శరీరానికి రోజంతా శక్తిని అందిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు పైనా ప్రభావం చూపుతాయి. తద్వారా మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి.
⚛ సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ 'కె'.. వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
⚛ బరువు పెరగాలనుకుంటే రోజూ సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇందులో లభించే ఫోలికామ్లం, విటమిన్ 'బి' గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
0 Comments:
Post a Comment