✍️మళ్లీ అడ్డగోలు బదిలీలు?
♦️200 మంది టీచర్లకు నేతల సిఫారసులు
♦️కోరుకున్న చోట పోస్టింగ్లకు ప్రయత్నాలు
♦️కిందిస్థాయి నుంచి మంత్రుల వరకూ పైరవీలు
♦️బదిలీల ఉత్తర్వుల్లో జాప్యానికి కారణమిదే
♦️గతంలో 399 మంది బదిలీకి సిఫారసు
♦️విషయం బయటకు రావడంతో నిలిపివేత
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అడ్డదారిలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేం దుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. తమకు కావాల్సిన వారి కోసం కిందిస్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ సిఫారసు చేస్తున్నారు. దాదాపు 200 మంది టీచర్లకు వారు కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించేందుకు పావులు కదుపుతు న్నారు. గతంలో చేసిన ప్రయత్నం బయటకు రావ డంతో బ్రేక్ పడింది. తాజాగా మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అందువల్లే ఉపాధ్యాయుల సాధా రణ బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోం దనే వాదన వినిపిస్తోంది. బదిలీల ఫైలు అన్ని స్థాయిల్లో ఆమోదం పొందినా... పాఠశాల విద్యా శాఖ పదే పదే వాయిదాలు వేస్తుండటం ఈ వాద నకు బలం చేకూరుస్తోంది. కొద్ది నెలల కిందట ఇలాంటి ప్రయత్నమే చేయడంతో ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అడ్డదారి బదిలీల కోసం రెండు విడతలుగా ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల సిఫారసు ఉన్న టీచర్లకు డిమాండ్ ఉన్న చోట పోస్టింగ్ ఇచ్చి, మిగిలిపోయిన స్థానాలను సాధారణ బదిలీల్లో చూపిస్తారు. దీనివల్ల ఆయా చోట్ల అర్హులుగా భావిస్తున్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. ఈ అడ్డదారి బదిలీలపై ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు ఇచ్చి, అనంతరం సాధారణ బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. బదిలీల వ్యవహారంపై వివరణ కోరేందుకు పాఠశాల విద్యా శాఖ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
♦️గతంలో ప్రయత్నించి వెనక్కు...
జూన్లోనూ 399 మంది టీచర్ల జాబితాను పాఠశాల విద్యా శాఖ తయారు చేసి డీఈవో కార్యాలయాలకు పంపింది. వారు అడిగిన స్థానాల వివరాలు వెంటనే పంపాలని ఆదేశించింది. అప్పట్లో 'బరితెగింపు బదిలీలు' శీర్షికతో 'ఆంధ్రజ్యోతి' కథ నాన్ని ప్రచురించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అడ్డగోలు బదిలీలకు సిఫారసు చేశారు. చివరకు ఓ సర్పంచ్ చేసిన సిఫారసును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బదిలీలను నిలిపివేసినట్లు విద్యా శాఖ మంత్రి సంఘాలకు తెలియజేశారు.
♦️2 నెలలుగా హడావుడి...
500 పాఠశాలల్లో తరగతుల విలీనంతో చాలామందికి తాత్కాలిక స్థానచలనం కలిగింది. తాజాగా సుమారు 4 వేలమందికి పదోన్నతులు కల్పించారు. దీంతో వీరికి రెగ్యులర్ స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చేందుకైనా బదిలీలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత రెండు నెలలుగా బదిలీలంటూ పాఠశాల విద్యా శాఖ హడావుడి మొదలు పెట్టింది. గత మూడు వారాలుగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రతిరోజూ చెబుతున్నా ఇవ్వడం లేదు. బదిలీలకు కనీస సర్వీసును 2 సంవత్సరాల నుంచి జీరోకు తగ్గించారు. ఆమోదం కోసం ఆర్థిక శాఖకు ఫైలు పంపామని పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. అయితే దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, ఆర్థిక శాఖ అనుమతే అక్కర్లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.
♦️అక్రమ బదిలీలు చేయొద్దు: ఏపీటీఎఫ్
బదిలీల కోసం టీచర్లు ఎదురు చూస్తున్న సమయంలో కౌన్సెలింగ్ లేకుండా కొందరిని బదిలీలు చేస్తారనే ప్రచారం సాగుతోందని, ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసి కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్. చిరంజీవి డిమాండ్ చేశారు. అక్రమ బదిలీల వల్ల రాజకీయ పలుకుబడి లేని సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బదిలీల జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
♦️ఇలాగైతే కౌన్సెలింగ్ ఎందుకు?: టీఎన్ యూఎస్
ప్రభుత్వం దొడ్డిదారిన కొందరు ఉపాధ్యాయులను బదిలీ చేస్తే, కౌన్సెలింగ్ విధానం ఎందుకని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యద రులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. బదిలీలు నేరుగా చేపట్టడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు.
0 Comments:
Post a Comment