✍️ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో పైరవీ బదిలీల అలజడి
♦️నేతల సిఫార్సులతో 140మంది జాబితా
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల సాధారణ బది లీలకు ముందు వైరవీ బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. రాజకీయ సిఫార్సుల బదిలీల దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. వీటికి ఆమోదం తెలిపిన తర్వాత సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం బావిస్తున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైకాపా నేతల సిఫార్సులతో 140మంది ఉపాధ్యాయుల బదిలీకి జాబితా సిద్ధం చేశారు. ఒక దస్త్రంలో 120 మంది పేర్లు ఉండగా.. మరో దస్త్రంలో 20 మంది జాబితా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ సమయంలో విచక్షణాధికారంతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే ఆగస్టులో నిర్వహిస్తామన్న బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోందని విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ పూర్తయినా బదిలీలను మాత్రం చేప ట్టడం లేదు. పదోన్నతుల అనంతరం కొత్తగా పోస్టింగ్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మౌనం వహిస్తు న్నారు. పైరవీ బదిలీలు పూర్తయిన తర్వాత సాధారణ బదిలీలు చేపడితే రాజకీయ బలం లేని ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారు. అయితే అక్రమంగా బదిలీలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వెంక టేశ్వర్లు, ప్రసాద్ హెచ్చరించారు.
0 Comments:
Post a Comment