ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. వివిధ సంస్థల నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) విడుదలయ్యాయి.
వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం డిగ్రీ(Degree) ఉత్తీర్ణత సాధించాలి. బ్యాంకు ఉద్యోగాల(Bank Jobs) దగ్గర నుంచి ఫ్యాకల్టీ వరకు ఏ విభాగంలో ఖాళీ పోస్టులు ఉన్నాయి.. ఏ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్(Recruitment) వచ్చింది .. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం.
హోమియోపతిలో..
నేషనల్ హోమియోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి వెబ్ సైట్ dia.nic.in ని సందర్శించండి . గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలు ఉండగా.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు లక్ష రూపాయల వరకు వేతనం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 30 నవంబర్ 2022.
ఉద్యోగాలు ">
అర్భన్ బ్యాంక్ లో..
మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజర్‌తో సహా మరో 21 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వీటి కోసం అభ్యర్థులు CA, MBA, గ్రాడ్యుయేషన్ అండ్ PG పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 35 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు mucbank.comవెబ్ సైట్ సందర్శించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 30 నవంబర్ 2022.
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్..
బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీర్ సహా 65 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీఎస్సీ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు cpri.res.in వెబ్ సైట్ సందర్శించి.. 21 నవంబర్ 2022 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థుల యొక్క వయోపరిమితి 28 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వీటికి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలో వచ్చిన మార్కులు అండ్ గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
DRDOలో ఉద్యోగాలు..
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ కోసం ఈ ఖాళీలను విడుదల చేశారు. వీటికి 01 నవంబర్ నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2022. దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు drdo.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. ఏదైనా స్ట్రీమ్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తారు.
0 Comments:
Post a Comment