Good News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాదీవెన నగదు జమ ఎప్పుడంటే?
Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఉన్న పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు. కొత్త పథకాల రూపకల్పన చేస్తున్నారు. పాత పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఉన్నత విద్యను అభ్యశిస్తున్న వారికి పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను సీఎం వైఎస్ జగన్ మదనపల్లెకు వెళ్లి.. అక్కడ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందించింది. ఇతర సంక్షేమ పథకాలతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని సీఎం స్పష్టం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.
జగనన్న విద్యా దీవెన కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
ఈ నెల 25న 'జగనన్న విద్యా దీవెన'నాలుగో విడత సాయం అందించున్నారు సీఎం జగన్. మదనపల్లెకు ఈనెల 25వ తేదీ సీఎం జగన్ రానున్నారు. నాలుగో విడత విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని విద్యాదీవెన సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు.
ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నవాజ్ భాషా, జెసి తమీమ్ అన్సారియా మదనపల్లిలో పర్యటించి సభ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని కదిరి రోడ్డు పక్కన టిప్పు సుల్తాన్ మైదానం, బీటీ ప్రభుత్వ కళాశాల మైదానం, చిప్పిలి డైయిరీ వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా దీవెన పంపిణీలో భాగంగా వచ్చే బుధవారం సీఎం మదనపల్లెకు వస్తున్నారన్నారు. రెండు మైదానాలను ఎంపిక చేసి ఒకదానిలో హెలిప్యాడ్, రెండో దానిలో సభ నిర్వహించనున్నమన్నారు.
తక్కువ సమయం ఉన్నందున పనులు వేగంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.
0 Comments:
Post a Comment