మన దేశం జీవ నదులకు పుట్టినిల్లు. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత.. అంతేకాదు వేల ఏళ్లనాటి చరిత్ర.. ఈ నదుల చుట్టూనే మన జీవనం. అన్ని నాగరికతలు వీటి నుంచే మొదలవుతాయి.
అంతే కాదుఈ నదులపైనే ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు. నదుల్లో ప్రవహించే నీటితో వ్యవసాయం చేస్తూ అన్నదాతలు కొందరైతే.. మరికొందరు చేపలు పట్టుకొని జీవనయానం సాగిస్తున్నారు.
అయితే మనదేశంలోని ఓ నది మాత్రం వీటన్నింటికి చాలా డిఫ్రెంట్.. ఇది మిగతా వాటితో పోల్చితే పూర్తి చాలా భిన్నమైనది. అది సాగు నీరు, చేపలు మాత్రమే కాదు.. బంగారాన్ని కూడా మోసుకొస్తోంది.
ఏన్నో ఏళ్లుగా ఈ నది తీసుకొచ్చే బంగారంతో జీవనం సాగిస్తున్నారు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు. అవును.. మీరు చదవుతున్నది నిజమే.. ఈ నది జీవరాసులు నిలయం మాత్రమే కాదు బంగారాన్ని మోసుకొచ్చే బంగారు నది. ఈ నది పేరు సుర్ణరేఖ నది లేదా సుబర్ణరేఖ నది. దీనినే స్వర్ణరేఖ అని కూడా పిలుస్తారు.
స్వర్ణరేఖ నది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే..
ఝార్ఖండ్‌లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణ రేఖ అనే నది మొదలవుతుంది. ఈ నదిలో బంగారం దొరుకుతుంది కాబట్టి ఈ నదిని స్వర్ణరేఖ నది అని పిలుస్తారు. ఈ నది నుంచి స్థానికులు బంగారాన్ని తీసుకుంటారు.
ఇది ఝర్ఖండ్‌తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ముందుకు సాగుతుంది. స్వర్ణరేఖ అంటే బంగారు గీత అని అర్ధం. పేరులో ఉన్నట్లుగానే.. ఈ నదిలో బంగారం లభిస్తుంది.
స్వర్ణ రేఖ నది నైరుతి దిశలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలోని ఓ బావిలో పుట్టి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా .. చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే స్వర్ణరేఖతో పాటు దాని ఉపపది కర్కారి నదిలో కూడా బంగారం కనిపిస్తుంది.
కర్కారి నదిలో నుంచి స్వర్ణరేఖ నదికి బంగారం రేణువులు చేరుతాయని అక్కడివారి నమ్మకం. అందుకే స్వర్ణరేఖ నదితోపాటు కర్కారి నదిలో కూడా బంగారం కోసం వెతుకుతుంటారు స్తానిక ప్రజలు.
ఈ కర్కారి నది పొడవు 37 కిలోమీటర్ల పాటు ప్రవహించి.. చివరికి స్వర్ణరేఖ నదిలో కలిసి పోతుంది. అసలు ఈ రెండు నదుల్లోకి బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పకిటీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ పరిశోధకులకు కూడా ఈ రహస్యం అంతు చిక్కలేదు.
ఉదయం నుండి సాయంత్రం వరకు బంగారం తీసే పనిలో..
జార్ఖండ్‌లో స్వర్ణరేఖ నది ప్రవహించే ప్రాంతల్లో ప్రజలు ఉదయాన్నే ఇక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకుని ఇసుకను జల్లెడపట్టి బంగారం సేకరిస్తున్నారు. ఇందులో చాలా తరాలుగా బంగారాన్ని వెలికితీసి డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ పురుషులు, మహిళలు మాత్రమే కాదు పిల్లలు కూడా నది నుంచి బంగారం వెలికితీసే పనిలో చాలా బిజీగా ఉంటారు.
బంగారం ఎలా తీస్తారంటే..
నదిలోని ఇసుకను జల్లడల ద్వారా వేరు చేసి.. ఒక్కొక్కటిగా బంగారం రేణువులను సేకరిస్తారు. అయితే అలా అని బంగారం ముద్దలుగా మాత్రం ఇక్కడ దొరకదు. ఒక వ్యక్తి ఒక నెలలో 70 నుంచి 80 బంగారు రేణువులను సేకరిస్తారు. ఈ బంగారు రేణువుల పరిమాణం బియ్యం గింజంత సైజులో కూడా ఉంటుంది.
అలా అని ఏడాది పొడవునా ఇక్కడ బంగారం దొరకదు. కేవలం వర్షాకాలం, శీతాకాలంలో మాత్రమే ఇక్కడ ఎక్కవగా బంగారం సేకరిస్తుంటారు. ఈ బంగారంను స్థానిక గిరిజనులు సేకరించడం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడి గిరిజనులు ఈ నది మొత్తాన్ని జల్లెడ పడతారు.
బంగారం రేణువులను దక్కించుకునేందుకు చాలా కష్టపడతారు. ఇలా బంగారం రేణువులను సేకరించి.. వాటిని దగ్గరలోని పెద్ద నగరానికి తీసుకెళ్లి అమ్ముతుంటారు.
నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందంటే..!
స్వర్ణరేఖ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటి వరకు మిస్టరీగా మిగిలిపోయింది. అయితే సర్ణరేఖ నది రాళ్ల ద్వారా వస్తుందని, అందుకే అందులో బంగారు రేణువులు కనిపిస్తాయని కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, బంగారం అక్కడికి ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు.
0 Comments:
Post a Comment