ఆ మహిళ పేరు రుచా. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ హోటల్లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగానే గత బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లింది.
ఎంత సేపటికీ బాత్రూమ్ నుంచి రుచా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బయటి నుంచి పిలిచినా రుచా నుంచి స్పందన లేదు. దీంతో ఇరుగు పొరుగు వారి సాయంతో బాత్రూమ్ తలుపు పగలగొట్టారు.
లోపల ఆమె నేలపై స్పృహ తప్పి పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. గీజర్ చాలా సేపు ఆన్‌లో ఉండడం, దాని నుంచి లీక్ అయిన గ్యాస్‌తో బాత్రూమ్ మొత్తం నిండిపోవడంతో సరిపడా ఆక్సిజన్ అందక రుచా చనిపోయిందని పోలీసులు గుర్తించారు.
గీజర్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1) ఒకవేల మీరు గ్యాస్ గీజర్‌ను వాడుతున్నట్టైతే.. గ్యాస్ సిలిండర్, గీజర్‌ను బాత్రూమ్ వెలుపలు బిగించుకోండి. అక్కడి నుంచి పైపు ద్వారా వేడి నీటిని లోపలికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకోండి.
2)ఒకవేల బాత్రూమ్ లోపలే ఏర్పాటు చేసుకున్నట్టైతే.. బాత్రూమ్ తలుపు మూసే ముందే బకెట్లో వేడి నీళ్లను నింపుకోండి. గీజర్ ఆఫ్ చేసిన తర్వాతే స్నానం చేయండి.
3)బాత్రూంలో క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. ఎవరైనా స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్లకండి. కాసేపు తలుపు తెరిచి ఉంచండి.
4)ఒకరి తర్వాత ఒకరు నిరంతరం స్నానం చేయడం వల్ల బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది.
5)గ్యాస్ గీజర్లలో హానికరమైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులను ఉపయోగిస్తారు. బాత్రూంలో గ్యాస్ లీకైనపుడు దానిని పీల్చినవారు క్షణాల్లో మూర్ఛపోతారు. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేక ప్రాణాలు కోల్పోతారు.
0 Comments:
Post a Comment