ఇప్పుడు మనం టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే..
భూమిపై ఉన్న ఏదో ఒక ప్రదేశానికి వెళ్తాం కదా.. భవిష్యత్తులో అలా కాదు. సముద్ర నగరాలకు కూడా వెళ్లొచ్చు. అక్కడ రకరకాల నగరాలు.. నీటిపై తేలుతూ తిరుగుతూ ఉంటాయి.
ఇప్పటికే ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరొకటి వచ్చింది. ఇది బాగా ఆకట్టుకుంటోంది. కారణం ఈ నగరం ప్లాన్ తాబేలు ఆకారంలో ఉండటమే. (image credit - instagram - pierpaololazzarini)
దీని పేరు పాంజియాస్ (Pangeos). ప్రపంచంలో తొలి నీటిపై తేలే నగరం ఇదే అంటున్నారు. ఇటలీలో లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టే.. లజ్జారినీ డిజైన్ స్టూడియో (Lazzarini Design Studio) ఈ ప్రాజెక్టును రూ.65 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకుంటోంది. (image credit - instagram - pierpaololazzarini)
ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో లజ్జారినీకి మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఇప్పటికే సముద్రంపై తిరిగే చాలా ఆధునిక బోట్లను తయారుచేసింది.
2033 లో తాబేలు నిర్మాణం మొదలై.. 8 ఏళ్లలో పూర్తవుతుందని భావిస్తోంది. దీని ద్వారా 60 వేల మంది సముద్ర నీటిపై జీవించవచ్చని చెబుతోంది. (image credit - instagram - pierpaololazzarini)
2000 అడుగుల వెడల్పు ఉన్న సముద్రాలపై తేలే తాబేలు నగరంలో హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు, డాక్, ఓ మినీ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. తాబేలు ఆగకుండా.. సముద్రాలపై తిరుగుతూనే ఉంటుంది. దీని వేగం గంటకు 9 కిలోమీటర్లు ఉంటుంది. (image credit - instagram - pierpaololazzarini)
ఈ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. వర్చువల్ NFT ఎంట్రన్స్ టికెట్స్‌ని రూ.1300కీ, వీఐపీ సూట్లను ఒక్కొక్కటీ రూ.13,500కి అమ్ముతోంది. (image credit - instagram - pierpaololazzarini)
ఈ తాబేలు నగరాన్ని నిర్మించాలంటే.. ముందుగా.. భూమిపై 2వేల చదరపు అడుగుల డ్రై డాక్ తయారు చెయ్యాలి. అందుకోసం సౌదీ అరేబియాలో ఏరియాని ఎంచుకున్నట్లు తెలిసింది. సముద్రం పక్కన వందల హెక్టార్లలో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. (image credit - instagram - pierpaololazzarini)
ఈ తాబేలు నగరానికి.. సూర్య కాంతి (solar cells) ద్వారా విద్యుత్ వస్తుంది. భారీ ఎత్తున సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తారు. ఇది మునిగిపోకుండా ఉండేందుకు.. 30వేల బ్యోయాన్సీ సెల్స్‌ని ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. (image credit - instagram - pierpaololazzarini)
భూమిపై 20 కోట్ల సంవత్సరాల కిందట ఒకటే భారీ ఖండం ఉండేది. దాన్ని పాంజియా (Pangea) అని పిలిచేవారు. అదే ప్రేరణతో.. తాబేలు నగరానికీ ఆ పేరు పెట్టారు. అప్పటి పాంజియా కాలక్రమంలో ముక్కలై... ప్రస్తుతం ఏడు ఖండాలుగా ఉంది.
0 Comments:
Post a Comment