Flipkart Sale: అమేజింగ్ ఆఫర్.. రూ.15,999కే 50 అంగుళాల స్మార్ట్ టీవీ..
TV Offers | పెద్ద స్క్రీన్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?
అది కూడా స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. 50 అంగుళాల స్మార్ట్ టీవీని అందుబాటు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.20 వేల ధరలోపే 50 అంగుళాల టీవీని కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో చాలా టీవీ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటాయి. నచ్చిన మోడల్ కొనొచ్చు. పలు రకాల టీవీలపై అదిరే ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్టాండర్డ్ డిస్కౌంట్‌తో పాటుగా బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. స్పెషల్ ఆఫర్లతో టీవీలను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. థామ్సన్ 9ఆర్ ప్రో 126 సీఎం స్మార్ట్ టీవీని అందుబాటు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందాం.
ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 42,999గా ఉంది. అయితే డిస్కౌంట్‌తో పోయిన తర్వాత ఈ స్మార్ట్ టీవీని రూ. 26,999కు కొనొచ్చు. అదే మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే.. మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై మరో ఆఫర్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ డీల్. ఈ టీవీపై రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ టీవీ ధర రూ. 15,999కు తగ్గుతుందని చెప్పుకోవచ్చు.
థామ్సన్ ఈ 50 అంగుళాల స్మార్ట్ టీవీలో 4కే రెజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, ఆండ్రాయిడ్ టీవీ బేస్డ్ సాఫ్ట్‌వేర్, గూగుల్ ప్లేస్టోర్, బెజిల్ లెస్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయ. 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ ఉంటాయి. 40 వాట్ స్పీకర్లు ఉన్నాయి. బిల్ట్ ఇన్ వైఫై ఉంటుంది. 20 వాట్ రెండు స్పీకర్లు ఉంటాయి.
అంతేకాకుండా ఈ టీవీలో మోషన్ సెన్సార్, ఇతర స్మార్ట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. ఇంకా రెండు యూఎస్‌బీ పోర్టులను గమనించొచ్చు. ఏఆర్ఎం కోర్టెక్స్ ఏ53 1.4 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఉంటుంది. అందుబాటు ధరలో మంచి టీవీ కొనాలని భావించే వారికి ఇది అదిరే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ టీవీ మీదనే కాకుండా ఇతర బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయ డీల్స్ ఉంటాయి
0 Comments:
Post a Comment