Fake Reviews: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో ఫేక్ రివ్యూలకు చెక్..
ఫేక్ రివ్యూలతో కస్టమర్లను బురిడీ కొట్టించే.. ఈ కామర్స్ సంస్థలకు చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. పక్కాగా రూపొందించిన మార్గదర్శకాలను వచ్చే వారం రిలీజ్ చేయబోతుంది.
ఇవి అమలైతే ఇక నుంచి కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఏ ప్రాంతానికైనా టూర్‌కి వెళ్లాలన్నా ముందు రివ్యూలు చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ రివ్యూలే ఫేక్ అయితే.. కొనుగోలుదారులు మోసపోతారు. అలా జరక్కుండా ఫేక్ రివ్యూలకి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం నడుం బిగించింది. 10లక్షల రూపాయల ఫైన్ వేయాలని డిసైడ్ అయింది.
భారత్‌లోని ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ప్రస్తుత మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. అలాగే నకిలీ రివ్యూల కట్టడికి కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తామన్నారు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్. ఇకపై ఈ కామర్స్, హోటళ్లు, విహారయాత్ర వెబ్‌సైట్లు లాంటి వాటికి ఇచ్చే రివ్యూలను పరిశీలించి, యూజర్లకు నిజమైన సమాచారం అందించేలా వాటిని రూపొందించామన్నారు.
ముందు ఈ ప్రక్రియ స్వచ్ఛందంగా జరుగుతుంది. ఆ తర్వాత తప్పనిసరి చేస్తామన్నారు రోహిత్ కుమార్. కరోనా సంక్షోభంతో ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగాయి. అయితే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కామర్స్ సంస్థలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సూచించింది. దీంతో వచ్చే వారంలో గైడ్‌లైన్స్ విడుదల కానున్నాయి.
0 Comments:
Post a Comment