Do you know the meaning of "white slip" - 'pink slip'..? Who gives to whom..?
"వైట్ స్లిప్" -'పింక్ స్లిప్' అంటే తెలుసా..? ఎవరు ఎవరికి ఇస్తారు..?
ఒక్కోరంగు ఒక్కో దానిని సూచిస్తుంది. తెలుపు శాంతిని, నలుపు నీరసనను సూచిస్తుంది. ఒక్కో కలర్ కు ఇలా ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఐతే ఇటీవల "పింక్ స్లిప్" అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు "పింక్ స్లిప్" అంటే ఏంటి..?
ఎలోన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలుచేసిన తర్వాత ఆయా కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేశాడు. ఒక్కోఉద్యోగి రోజుకి 12గంటలు పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఇలా పనిచేయడం ఇష్టం లేనివాళ్లు రాజీనామా చేయవచ్చని, కొన్నాళ్ల తర్వాత ఉద్యోగుల పనితనం సరిగాలేకపోతే వారికి "పింక్ స్లిప్స్" ఇచ్చేందుకు వెనుకాడబోమని ఎలోన్ మస్క్ ట్విట్టర్ లో పనిచేసే ఉద్యోగులను హెచ్చరించారు. .
ఈ నేపథ్యంలో "పింక్ స్లిప్" అనేది మరింతగా ప్రచారంలోకి వచ్చింది.
ఒక్క ట్విట్టర్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో ఇలా పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు "పింక్ స్లిప్" ఇస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో 2008లో ఐటీ సంస్థలు దివాళా తీయడంతో ఎక్కువమంది ఎంప్లాయిస్ ను తొలగించాయి. ఉద్యోగులను తొలగించడాన్నే "పింక్ స్లిప్ " అంటారు. తాను పనిచేసి సంస్థ ఒక ఉద్యోగికి పింక్ స్లిప్ ఇచ్చింది అంటే..జాబ్ నుంచి తొలగించిందని అర్థం.
ఈ పింక్ స్లిప్ విధానానికి అమెరికా కు చెందిన ఫోర్డ్ మోటార్స్ ఫౌండర్ "హెన్రీ ఫోర్డ్" ను ఆద్యుడు గా భావిస్తారు. ఈయన తన కంపెనీలో నష్టాలు రావడంతో రోజువారీ కూలీలను తొలగించేందుకు ఆయన తొలిసారిగా పింక్ స్లిప్ విధానాన్ని అనుసరించారు. అలాగే తొలగించిన ఉద్యోగులను జాబ్ లోకి మళ్ళీ చేర్చుకొనే విధానాన్ని "వైట్ స్లిప్" అంటారు. దీనిని కూడా "హెన్రీ ఫోర్డ్" ఫస్ట్ టైం అమలుచేశారు.
0 Comments:
Post a Comment