Diabetes Diet: ఈ 4 పదార్ధాలు తింటే..మీ బ్లడ్ షుగర్ కేవలం 14 రోజుల్లో సాధారణ స్థాయికి..
ప్రపంచాన్ని సవాలు విసురుతున్న వ్యాధి మధుమేహం. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా సంక్రమిస్తున్న వ్యాధి ఇది. ఆ నాలుగు పదార్ధాలు తప్పకుండా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మధుమేహం వ్యాధిని సరైన డైట్, సరైన నిద్ర వంటివాటితో నియంత్రణలో ఉంచవచ్చు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాంతకమౌతుంది. మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారుతోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచేందుకు చాలా రకాల మందులున్నాయి. కానీ డైట్‌లో మార్పులు మాత్రం చేయాల్సిందే. లైఫ్‌స్టైల్ మార్చుకోవాలి. ముఖ్యంగా డైట్‌లో నాలుగు పదార్ధాలు తప్పకుండా చేర్చుకోవాలంటున్నారు. ఆ వివరాలు చూద్దాం.
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు తీసుకోవల్సిన 4 పదార్ధాలు
ముల్లంగి
ముల్లంగి అనేది ఫైబర్ పుష్కలంగా ఉండే పదార్ధం. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. మీరు డయాబెటిస్ రోగి అయితే..ముల్లంగిని రోజూ సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.ముల్లంగి పరాఠా కూడా మంచిదే.
కాకరకాయ
రుచిలో చేదుగా ఉన్నా..ఆరోగ్యపరంగా అద్భుతమైన ఔషధం కాకరకాయ. రుచి చేదుగా ఉండటంతో చాలామంది కాకరకాయ ఇష్టపడరు. కాకరకాయతో అధిక బరువుకు చెక్ పెట్టడం, షుగర్ లెవెల్స్ నియంత్రణ అన్నీ సాధ్యమే. కాకరకాయను డయాబెటిస్ నియంత్రించేందుకు దోహదపడుతుంది.
రాగులు
రాగుల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే రాగులు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు గోధుమ రొట్టెలకు బదులు రాగి రొట్టెలు తింటే చాలా చాలా మంచిది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
బుక్విట్
బుక్వీట్ పిండిని చాలామంది వ్రతం సందర్భంగా తింటారు. కానీ ఈ పండి రొట్టెలు డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
0 Comments:
Post a Comment