Depression : ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ? అయితే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే ...
ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి ఏంటంటే డిప్రెషన్ . ఇది ఎప్పుడు..ఎలా .. ఎందుకు.. వస్తుందో కూడా తెలీదు.
ఏమి లేకపోయినా ఎదో ఉన్నట్టు, ఏమి జరగకపోయినా ఎదో జరిగినట్టు, ఏమి జరుగుతుందా అని జరగకుండానే జరిగినట్టు ఊహించుకోవడం ఇలా ఒకటి కాదు ఎన్నో రకాలుగా ఊహించుకుంటారు . ఒక మనిషిని డిప్రెషన్ బాగా తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమి జరిగిన కూడా మనసుకు తీసుకోకుండా అక్కడితోనే వదిలేయండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైనా బాధను పట్టుకొని నాకు బాధగా ఉంది అంటే బాధే ఉంటుంది. నాకు ఎన్ని బాధలు వచ్చిన నాలాగే ఉండాలి అని అనుకోండి. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ? అయితే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే .
1. జరిగిపోయిన విషయాలను పదే పదే గుర్తు చేసుకొని మరి బాధ పడుతుంటారు.
2. ఎవరో ఏదో అన్నారని బాధ పడిపోతుంటారు.
3. చిన్న దానికి కూడా కంగారు పడతారు.
4. ఒక్కోసారి మీ మీద మీకే నమ్మకం పోతుంది.
5. ఎదుటి వారు మాట్లాడినప్పుడు మీకు చిరాకుగా అనిపిస్తుంది.
6. బాధలు లేకపోయినా తెచ్చుకొని మరి బాధ పడుతుంటారు.
0 Comments:
Post a Comment