Dark Circles Removal Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిట్కాలతో శాశ్వతంగా డార్క్ సర్కిల్స్ చెక్..
Dark Circles Removal Tips: వాతావరణం లో కాలుష్యం పెరగడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు వాపు సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి.
ఈ సమస్యలు ఒత్తిడి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు టెన్షన్ పడడం వల్ల ఒత్తిడికి గురై ఈ సమస్యలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో ఈ డార్క్ సర్కిల్స్ కంప్యూటర్ స్క్రీన్ అధికంగా చూడడం వల్ల కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు పలు ఇంటి నివారణలను సూచిస్తున్నారు. ఆ నివారణలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాళదుంప రసం:
కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించేందుకు బంగాళదుంప రసం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం ముందుగా ఒక బంగాళదుంపని తీసుకొని దానిని సన్నగా తురుముకొని ఆ వలయాలపై 15 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఇలా 15 నిమిషాల్లో ఉంచిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు నల్లటి వలయాల కింద అప్లై చేస్తే మీరు త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
కంటి మసాజ్:
కళ్ళ కింద మసాజ్ చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ను నియంత్రించవచ్చని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే దీనికోసం కొబ్బరి నూనెను తీసుకుని.. నల్లని వలయాలు ఉన్నచోట అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత దానిపై తేనె వేసి మళ్లీ ఓ రెండు నిమిషాల పాటు స్మూత్ గా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 15 నిమిషాలపాటు చేసి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. మీరు అనుకున్నంత త్వరలోనే నల్లటి వలయాలు తొలగిపోతాయి.
నిమ్మ, టమోటా:
నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు టమాటో ముక్కలను తీసుకుని వాటిని రసంలా చేసి అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తెల్ల కింద వలయాలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసే ముందు తప్పకుండా జాగ్రత్తగా కళ్ళలో పడకుండా అప్లై చేయాలి. లేదంటే కళ్ళలోకి వెళ్ళిపోయి కళ్ల మంటలు రావచ్చు.
దోసకాయ:
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించుకోవడానికి దోసకాయలు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడతాయి. అయితే దోసకాయలను ఎలా వినియోగించాలని అనుకుంటున్నారా..?. ముందుగా దోసకాయలను కోసి కళ్ళపై స్మూత్ గా మసాజ్ చేయాలి ఆ తర్వాత డార్క్ సర్కిల్స్ పై ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగిపోయి.. కళ్ళు మెరుగుపడతాయి.
మాయిశ్చరైజర్ ఉపయోగించండి:
కళ్ళ కింద వాపు, నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించి మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వినియోగించడం వల్ల కూడా నల్లటి వలయాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
0 Comments:
Post a Comment