Cheapest Cars: ధర రూ.4 లక్షలు.. మైలేజ్ 33 కిలోమీటర్లు, చౌక ధరకే లభిస్తున్న 4 కార్లు ఇవే!
Best Mileage Cars | మినీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ప్రస్తుతం డిమాండ్ బాగుందని చెప్పుకోవచ్చు.
వీటికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు మాత్రం డిమాండ్ అలానే కొనసాగుతోందని చెప్పుకోవాలి. స్మాల్ కార్లకు మధ్యతరగతి నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
స్మాల్ కార్ల ధర తక్కువగా ఉంటుంది. అందుబాటు బడ్జెట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా వీటి మెయింటెనెన్స్ కూడా తక్కువే. అందుకే చిన్న కుటుంబాలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే వీటికి డిమాండ్ బాగుంది.
చిన్న కుటుంబాలకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ వెహికల్స్ ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్ల ధర రూ. 3.9 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అందుబాటు ధరలో లభిస్తున్న 4 కార్లు ఏంటివో ఇప్పుడు చూద్దాం.
మారుతీ సుజుకీ అల్టో కారుకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారులో 0.8 లీటర్ 3 సిలిండర్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 33 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది.
ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, కీ లెస్ ఎంట్రీ, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 3.39 లక్షలు.
మారుతీ ఎస్‌ప్రెసో కారు కూడా ఉంది. ఇందులో 998 సీసీ ఇంజిన్ అమర్చారు. సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు భాగంలో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, ఎయిర్ కండీషనర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 4.25 లక్షల నుంచి ఉంది.
మారుతీ సెలెరియో కారులో కే10సీ డ్యూయెల్జెట్ 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. స్టార్ట్, స్టాప్ సిస్టమ్‌తో ఈ వెహికల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 5 స్పీడ్ మ్యానువల్, ఏఎంటీ గేర్ బాక్స్ వేరియంట్ల రూపంలో ఇది లభిస్తోంది.
ఈ కారులో 12 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.25 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.
టాటా టియాగో కారు 1.2 లీటర్ రెవోట్రోన్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది హ్యాచ్ బ్యాక్ కారు. ఇందులో 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ ఉంది. పది వేరియంట్ల రూపంలో ఈ కారు లభిస్తోంది.
ఇందులో 15 అంగుళాల అలాయ్ వీల్స్, రియర్ డీఫాగర్, వైపర్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి పీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.44 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.
0 Comments:
Post a Comment