CGHS Recruitment 2022: పదో తరగతి/ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్.. ఒప్పంద ప్రాతిపదికన 98 మల్టీ టాస్క్ స్టాఫ్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియల్, ఫార్మసీలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 25, 2022వ తేదీలోపు పోస్టును బట్టి ఆయా అడ్రస్‌లకు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
మల్టీ టాస్క్ స్టాఫ్ ఖాళీలు: 43
ఫార్మసిస్ట్ ఖాళీలు: 24
నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలు: 3
లోయర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు: 28
అడ్రస్:
Central Govt. Health Scheme, Nagpur
Central Govt. Health Scheme, Mumbai
Central Govt. Health Scheme, Raipur & Chandrapur (Under administrative control of Additional Director, CGHS, Nagpur)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
0 Comments:
Post a Comment