సర్వైకల్ స్పాండిలైటిస్ తీవ్రమైన మెడనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందంటే..బతుకు దుర్భరమైపోతుంది.
ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం. సర్వైకల్ స్పైన్ బలహీనంగా ఉంటే..సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య ఉత్పన్నమౌతుంది. సర్వైకల్ నొప్పిని దూరం చేయాలంటే కొన్ని నెక్ ఎక్సర్సైజ్లు అవసరమౌతాయి. సర్వైకల్ లక్షణాలు దూరమౌతాయి.
సర్వైకల్ నొప్పి నుంచి ఉపశమనం కోసం నెక్ ఎక్సర్సైజ్లు
1. నెక్ స్ట్రెచ్
ముందుగా శరీరాన్ని నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇప్పుడు మీ గెడ్డం భాగాన్ని స్ట్రెచ్ అయ్యేలా ముందుకు వంచాలి. ఇలా 5 సెకన్లు ఉంచి..తిరిగి మామూలు పరిస్థితికి వచ్చేయాలి. ఆ తరువాత వెనక్కి తీసుకెళ్లి..గెడ్డం భాగాన్ని పైకి లేపి..5 సెకన్లు ఉంచాలి. ఇలా 5 సార్లు చేయాలి.
2. నెక్ టిల్ట్
నడుమును నిటారుగా చేసి కూర్చోవాలి. గెడ్డం భాగాన్ని కిందకు వంచాలి. ఎలాగంటే మీ గెడ్డంతో ఛాతీని టచ్ చేయాలి. ఓ ఐదు సెకన్లు ఇలా చేసి..తిరిగి వెనక్కి వచ్చేయాలి. ఇలా రోజుకు 5 సార్లు చేయాలి
3. సైడ్ టు సైడ్ నెక్ టిల్ట్
మీ మెడను నిటారుగా ఉంచి ఓ వైపుకు వంచాలి. ఎలాగంటే మీ చెవి మీ భుజాల్ని తాకాలి. ఇలా 5 సెకన్లు ఉంచిన తరువాత యధాతధ స్థితికి వచ్చేయాలి. ఇప్పుడు తలను సాధారణ స్థితి నుంచి రెండవ భుజం వైపుకు వంచాలి. ఇలా మరో 5 సెకన్లు ఉంచాలి.
4. నెక్ టర్న్
నడుమును నిటారుగా ఉంటి కూర్చోవాలి. మెడను ఓ వైపుకు తిప్పాలి. మెడ ఎంత వీలైతే అంత తిప్పాల్సి ఉంటుంది. కనీసం 5 సెకన్లు ఉంచాలి. తిరిగి యధాతథ స్థితికి చేర్చాలి. ఇప్పుడు రెండవవైపుకు మెడను తిప్పి.మరో 5 సెకన్లు ఉంచాలి.
0 Comments:
Post a Comment