Central Govt Jobs 2022: టెన్త్ అర్హతతో 1671 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల (Central Government Jobs) కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ (IB Job Notification) ప్రకారం.. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
క్ర.సం. విభాగం ఖాళీలు
1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1521
2. ఎంటీఎస్ పోస్టులు 150
మొత్తం: 1671
విద్యార్హత:పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థికి స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి:ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనాలు:
- సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వేతనం ఉంటుంది.
- ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.56900 వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
- అభ్యర్థుల ఎంపిక: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
0 Comments:
Post a Comment