మనవజాతి చరిత్ర ఈ రోజు ఓ మైలురాయిని దాటింది. ప్రపంచ జనాభా 800 కోట్లు చేరుకుంది. నవంబర్ 15న ఈ ల్యాండ్ మార్క్ చేరినట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఓ ప్రకటనలో తెలిపారు.
''భిన్నత్వానికి, ప్రగతికి చిహ్నమైన ఈ వేడుకకు భూగోళం పట్ల మన బాధ్యతను గుర్తుచేస్తుంది' అని అన్నారు. ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రం, వైద్యసదుపాయాల వల్లే ఇది సాధ్యమైందని పేరొన్నారు.
12 ఏళ్లలో వందకోట్లు
కొన్ని దశాబ్దాలలుగా ప్రపంచ జనాభా బాగానే పెరుగుతోంది. 12 సంవత్సరాల కిందట 700 కోట్లు ఉన్న మానవ సంఖ్య ప్రస్తుతం 800 కోట్లు చేరింది.
అయితే ఇకముందు అంత వేగంగా పెరగకపోవచ్చని 800 కోట్ల నుండి 900 కోట్లకు చేరడానికి 15 సంవత్సరాల కాలం పడుతుందని భావిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ, ఆధునిక జీవనశైలి వంటివి దీనికారణంగా చెబుతున్నారు. ఏదేమైనా 15 ఏళ్లకొకసారి వంద కోట్ల చొప్పున పెరిగినా ఈ శతాబ్దం చివరికి అంటే 2300 నాటికి మరో 500 కోట్లు పెరిగి 1200 కోట్ల నుంచి 1300 కోట్ల జన విస్ఫోటం తప్పదు..
ఆసియాదే మెజారిటీ..
ప్రస్తుత 800 కోట్లు జనాభాలో అత్యధికం ఆసియా ఖండం నుంచే ఉంది. భూగోళంపై 195 దేశాలు ఉండగా చైనా, భారత్‌ల నుంచే 280 కోట్ల మంది ఉన్నారు. చైనాలో 142.5 కోట్ల మంది, భారత్ లో142 కోట్ల మంది ఉన్నారని అనధికారిక అంచనా.
ప్రపంచ జనాభాలో ఈ రెండే దేశాల వాటా 35 శాతం. చైనాలో జనాభా పెరుగుదల బాగా పడిపోగా భారత్‌లో మాత్రం 0.68 ఉంది.
దీంతో వచ్చే ఏడాదికి 2023నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా రికార్డు భారత్ ఖాతాలో పడనుంది. ఆఫ్రికా దేశాల్లోనూ జనసంఖ్య బాగా పెరుగుతోంది.
లెక్కలతోపాటు..
జనాభా పెరుగుదలతోపాటు మానవాళి ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది. కొన్ని శతాబ్దాల క్రితం, దశాబ్దాల క్రితం లేదని వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఆయుర్దాయం పెరిగింది.
ప్రస్తుతం సగటు ఆయుర్దాయం 72.8 ఏళ్లు. 2050 సంవత్సరానికి 77.2 సంవత్సరాలకు చేరుకోవచ్చని అంచనా.
0 Comments:
Post a Comment