CBSE: 10+2 విధానంపై సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇలా..
దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో(Education System) సరికొత్త పంథాను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) వచ్చే అకడమిక్ సెషన్ నుంచి 5+3+3+4 పెడగాజికల్ స్ట్రక్చర్ వైపు మళ్లేందుకు సంసిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఉన్న 10+2 సిస్టమ్ నుంచి ప్రతిపాదిత 5+3+3+4 సిస్టమ్‌కు ట్రాన్స్‌ఫామ్ కావడానికి అవసరమైన నిబంధనలు రూపొందించాలని అనుబంధ స్కూళ్లకు త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
* అధికారిక ఫ్రేమ్‌వర్క్‌లోకి ఫార్మల్ ఎడ్యుకేషన్
మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించడం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే చాలా సీబీఎస్‌ఈ స్కూల్స్ ప్రీ-నర్సరీస్, ప్రిపరేటరీ స్కూల్స్ విధానంతో చిన్న పిల్లల విద్యలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. త్వరలోనే బోర్డు ప్రయత్నాల్లో భాగంగా ఇది అధికారిక CBSE సిస్టమ్ ఫ్రేమ్‌వర్క్ కిందకు రానుంది.
* 5+3+3+4 సిస్టమ్ వివరాలు
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో పేర్కొన్న విధంగా న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్ పిల్లల ఎడ్యుకేషన్‌ను నాలుగు దశలుగా విభజించింది. మొదటిది ఫౌండేషనల్ స్టేజ్. ఇది ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. తరువాత రెండు దశలు ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్‌లుగా ఉంటాయి. ఒక్కొక్కటి మూడేళ్ల పాటు ఉంటుంది. ఇక, చివరిది సెకండరీ స్టేజ్. ఇది నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది.
* త్వరలో ఆదేశాలు
సీబీఎస్‌ఈ చైర్ పర్సన్ నిధి ఛిబ్బర్ మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ సెషన్ నుంచి బోర్డ్ కొత్త సిస్టమ్‌కు షిఫ్ట్ కానుందని తెలిపారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ(NEP)కి అనుగుణంగా 10+2 సిస్టమ్ బదులు కొత్త 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను అన్ని పాఠశాలు అవలంబించేందుకు బోర్డు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుందని వెల్లడించారు. పాఠశాల విద్యలో మల్టిపుల్ స్టేజ్‌ల్లో వృద్ధిని ట్రాక్ చేయడానికి సీబీఎస్‌ఈ స్కూల్ రిజిస్ట్రీ, టీచర్ రిజిస్ట్రీ, స్టూడెంట్ రిజిస్ట్రీని క్రియేట్ చేయనుందన్నారు.
* కోచింగ్ అవసరం లేకుండా..
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద కూడా10, 12 తరగతుల పరీక్షల్లో గ్రేడ్స్ విధానాన్ని కొనసాగించనున్నారు. అయితే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఎగ్జామ్‌నేషన్ సిస్టమ్ లో మార్పులు చేయనున్నారు. ఎన్‌ఈపీ ప్రకారం.. బోర్డు పరీక్షల 'హై స్టేక్' అంశాన్ని తొలగించడానికి, విద్యార్థులందరూ అకడమిక్ ఇయర్ లో రెండు సందర్భాల్లో పరీక్షలు రాయనున్నారు. మెయిన్ పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావ్సాలి ఉంటుంది. అయితే ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఆప్షనల్‌గా ఉంటుంది.
కాగా, భారత ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో విప్లవాత్మక మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్‌లో అనేక మార్పులు చేయనునున్నారు. సీబీఎస్‌ఈ కూడా 10+2 సిస్టమ్‌కు గుడ్ బై చెప్పి, 5+3+3+4 సిస్టమ్‌ను త్వరలో అమలు చేయనుంది.
0 Comments:
Post a Comment