అలాగైతే కేసు ఉపసంహరణకు ఓకే
రెండో ఎంఈవో వ్యవస్థపై చర్చలు
➪ ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 5:
☆ యాజమాన్యాల తో నిమిత్తం లేకుండా ఇద్దరు ఎంఈవో (మండల విద్యా ధికారి-1, 2)ల నియామకాల్లో సీనియార్టీ ప్రాధాన్యతన నియమించాలని అభ్యర్థిస్తూ ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి, ఎం ఈవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం నేతృత్వం లోని బృందం పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేసింది.
☆ శుక్రవారం రాత్రి గొల్లపూ డి(విజయవాడ)లోని రాష్ట్ర కమిషనర్ ను కలుసుకుని జరి పిన చర్చల వివరాలను శనివారం ఇక్కడ పత్రికలకు సం ఘ రాష్ట్రకోశాధికారి ఎస్.నరసింహమూర్తి తెలిపారు.
☆ ప్రభుత్వం కొత్తగా రెండో ఎంఈవో వ్యవస్థను ప్రారంభిం చేందుకు చేపట్టేందుకు జారీ చేసిన జీవో ఉత్తర్వులు 154 ని సవాల్ చేస్తూ కొందరు ప్రధానోపాధ్యాయులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏర్పడిన సందిగ్ధతను తొలగిం చేందుకు కమిషనర్ ను ఎంఈవోలు కలిసి రాజీ చర్చలు జరిపారు.
☆ ప్రస్తుతం పనిచేస్తోన్న రెగ్యులర్ ఎంఈవోలందరినీ ఎంఈవో-1గా పరిగణించాలని కోరామన్నారు.
☆ మేనేజిమెంట్ తో సంబంధం లేకుండా పోస్టులను కన్వర్షన్ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
☆ నూతన ఎంఈవోల ఎం పికకు ముందుగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఈవోలం దరికీ సాధారణ బదిలీలు నిర్వహించాలని అభ్యర్థించామ న్నారు.
☆ గవర్నమెంట్ మేనేజ్మెంట్ తోపాటు పంచాయతీ రాజ్(పీఆర్) ఎంఈవో/ హెచ్ఎంలకు డీవైఈవో పదోన్నతి కల్పించి సమన్యాయం చేయాలని కోరామన్నారు.
☆ ఈ అభ్యర్థనలను పరిష్కరిస్తే జీవోపై కోర్టులో దాఖలైన కేసు ఉపసంహరణకు సంఘం కృషి చేస్తుందన్నారు.
0 Comments:
Post a Comment