విద్యాశాఖతో గేమ్స్
రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటి వరకు స్వయం సహాయక మహిళా సంఘాలు, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ తదితర విభాగాలను పర్యవేక్షించే ఏపీఎంలు ఇక నుంచి అదనంగా విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.
విద్యాశాఖ బాధ్యతలు డీఆర్‌డీఏ ఏపీఎంలకు..
పొంతనలేని సబ్జెక్ట్‌లు కట్టబెట్టడంపై విమర్శలు
అనంతపురం క్లాక్‌టవర్ : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటి వరకు స్వయం సహాయక మహిళా సంఘాలు, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ తదితర విభాగాలను పర్యవేక్షించే ఏపీఎంలు ఇక నుంచి అదనంగా విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ, డీఈఓలకు జారీ చేసింది. నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, పాఠశాల, మరుగుదొడ్లు నిర్వహణ విధులు, పాఠశాల తనిఖీలు, సిలబస్, ఉత్తీర్ణత, డ్రాపౌట్స్ పర్వవేక్షణ బాధ్యతలు ఏపీఎంలు చూడాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలు ఎంఈఓ, ఏపీఎం, ప్రధానోపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని పలువురు వాపోతున్నారు.
సొంత శాఖపైనే పట్టులేని వైనం
డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఏపీఎంలకు సొంత శాఖపైనే పూర్తిగా పట్టులేదు. అయినా ఇతర శాఖల బాధ్యతలు అప్పగిస్తే ఎలా సక్రమంగా నిర్వహిస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. ఎంఈఓలు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలతో పాటు నాడు-నేడు వంటి ఇతర విధులు చేయాల్సి రావడం విద్యా ప్రమాణాల పెంపునకు అవరోధం అవుతోంది. పాఠశాల అభివృద్ధి, సంక్షేమం వెనుకబడుతున్నాయి. ఈ లోపాలను సరిదిద్ది సక్రమంగా నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే డీఆర్‌డీఏను నిర్వీర్యం చేసేందుకే ఈ కుయుక్తులు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.
ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం
ఏపీఎంలకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఏపీఎంలు ప్రజాప్రతినిధులతో ఇప్పటికే సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. విద్యాశాఖలో బాధ్యతలను ఏపీఎంలకు అప్పగిస్తే రాజకీయజోక్యం నేరుగా వస్తుందని చర్చించుకుంటు న్నారు. ఎటువంటి సంబంఽధం, అవగాహన లేని ఏపీఎంలకు విద్యాశాఖలో బాధ్యతలు అప్పగించడం సరికాదని ఉపాధ్యాయవర్గాలు వాపోతున్నాయి. డీఆర్‌డీఏ పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘల పర్యవేక్షణ, ఇతర పథకాల పర్యవేక్షణకు పరిమితమైన ఏపీఎంలకు కొత్తగా సంబంధం లేని శాఖ బాధ్యతలు అప్పగిస్తే ఏమేరకు పనులు చేస్తారోననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యాశాఖలో ఇద్దరు ఎంఈఓలను మండలాలకు నియమించాలని భావిస్తున్న ప్రభుత్వానికి అదనంగా ఏపీఎంల జోక్యం ఎందుకని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి పలు పథకాల పర్యవేక్షణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎక్కువ మందిని విద్యాశాఖలోకి జోక్యం పెంచడంతో సమస్యలు తలెత్త అవకాశం లేకపోలేదు. కాగా నాన అకడమిక్ పనుల పర్యవేక్షన బాధ్యతలు మాత్రమే ఏపీఎంలకు అప్పగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో నాడు-నేడు పనులు చేపట్టడంలోనూ, మౌలిక వసతులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు వారు వివరించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే:... : నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఏపీఎంలకు విధులు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా మనబడి, నాడు-నేడు, విద్యాదీవెన, విద్యాకానుక, జగనన్నగోరుముద్ద వంటి పథకాల అమలు పర్యవేక్షణ బాధ్యత ఏపీఎంలదే. నేరుగా విద్యార్థులకు పాఠాలు బోధించకపోయినా విద్యా ప్రమాణాలు పెంచడంలో ఏపీఎంల పాత్ర కీలకంగా మారనుంది. ఇప్పటికే అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన ఏపీఎంలకు స్థానిక టీటీడీసీలో శిక్షణ ఇచ్చాం.
0 Comments:
Post a Comment