యూట్యూబ్‌లో చూసి... శ్రమ తగ్గేలా చేసి!
సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల రాజు రైతు. పంటల సాగుతో పాటు పశుపోషణ జీవనాధారం. రోజూ పశువులకు గడ్డికోసుకెళ్లడం, పొలానికి యూరియా, ఇతరత్రా ఎరువులు మోసుకెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు.
ఒకరోజు యూట్యూబ్‌లో ద్విచక్రవాహనానికి అనుసంధానించి ట్రాలీని వినియోగిస్తుండటం చూశారు. తానూ దానిని వాడగలిగితే బరువులు మోసే బాధ తప్పుతుందనుకున్నారు. సిద్దిపేటలో తనకు తెలిసిన మిత్రుడిని సంప్రదించారు. రూ.15వేలు ఖర్చుచేయగా, అనుకున్న ఆకృతిలో ట్రాలీ సిద్ధమైంది. గడ్డిమోపులు, ఎరువుల బస్తాలు, ఇతరత్రా పరికరాలను ఈట్రాలీలో వేసుకొని పొలానికి, ఇంటికి హాయిగా తిరుగుతున్నారు.
0 Comments:
Post a Comment