BBC NEWS19వ శతాబ్ధంలో చరిత్ర నుంచి కనుమరుగు అయిన స్పాన్సియన్ చక్రవర్తి ముఖచిత్రంతో కూడిన నాణేం
చరిత్రలో కల్పిత పాత్రగా చెప్పుకున్న మూడో శతాబ్దపు ఒక రోమన్ చక్రవర్తి నిజానికి ఉండేవారని ఒక పురాతన బంగారు నాణేం వల్ల రుజువు అయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ట్రాన్సిల్వేనియాలో 300 ఏళ్ల క్రితం స్పాన్సియాన్ అనే పేరుతో పాటు వ్యక్తి ముఖచిత్రం ఉన్న నాణేం లభ్యమైంది. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యానికి ఈ ప్రాంతం సైనిక స్థావరంగా ఉండేది.
ఆ నాణేన్ని నకిలీదని భావించి దాన్ని మ్యూజియంలోని అల్మారాలో ఉంచారు.
ఈ నాణేం 2000 ఏళ్ల క్రితం చెలామణిలో ఉండేదని నాణేన్ని మైక్రోస్కోపులో చూస్తే కనిపించే గీతలు రుజువు చేస్తున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణతో తాను ఆశ్చర్యపోయానని బీబీసీతో పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ పాల్ పియర్సన్ అన్నారు.
''నాణేంపై ఉన్న చిత్రం ఒక చక్రవర్తిది అని మేం కనుగొన్నాం. ఆయనను ఒక కల్పిత పాత్రగా పరిగణించారు. చరిత్ర నిపుణులు ఆయన గురించి అలాగే రాశారు.
PAUL PEARSONస్పాన్సియన్ పాలించిన ట్రాన్సిల్వేనియాలోని రోమన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్‌గా ఉన్న రోమన్ కోట శిథిలాలు
కానీ, ఆయన నిజమైన చక్రవర్తి అని, చరిత్రలో ఆయన పాత్ర ఉందని మేం భావిస్తున్నాం'' అని ఆయన చెప్పుకొచ్చారు.
1713లో ఈ నాణేన్ని కనుగొన్నారు. 19వ శతాబ్దపు మధ్య కాలం వరకు ఇది నిజమైన రోమన్ నాణేం అని భావించారు. అయితే ఆ నాణేం డిజైన్‌ను చూసి అది నకిలీ నాణేం కావొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు.
1863లో ఈ అనుమానం మరింత బలపడింది. బిబ్లియోథెక్ నేషనల్ డి ఫ్రాన్స్‌లోని ప్రముఖ నాణేల నిపుణు హెన్రీ కోహెన్ ఆ నాణేన్ని పరిశీలించి అది నకిలీది మాత్రమే కాదు దాన్ని నాసిరకంగా తయారుచేశారని చెప్పారు.
ఇతర నిపుణులు కూడా హెన్రీ మాటలను అంగీకరించారు. అప్పటినుంచి దాన్ని అపూర్వ వస్తువుల జాబితా నుంచి తొలిగించారు.
రోమన్ సామ్రాజ్య చరిత్ర పుస్తకం గురించి పరిశోధిస్తుండగా ఈ నాణేం ఫొటోలను చూసినప్పుడు ప్రొఫెసర్ పియర్సన్కు అనుమానం కలిగింది.
నాణేంపై ఉన్న గీతలను చూసిన ఆయన చెలామణిలో ఉన్న సమయంలోనే దానిపై ఆ గీతలు పడి ఉంటాయని అనుమానించారు.
గ్లాస్గో యూనివర్సిటీలోని హంటేరియన్ మ్యూజియాన్ని ఆయన సంప్రదించారు. అక్కడి పరిశోధకులతో కలిసి తాను కూడా పనిచేయొచ్చా అని వారిని అడిగారు. ఇంతకాలంగా ఆ నాణేం ఇదే మ్యూజియంలో ఉంది. మరో మూడు నాణేలతో కలిపి దాన్ని అక్కడే అల్మారాలో ఉంచారు.
శక్తిమంతమైన మైక్రోస్కోప్ సహాయంతో నాలుగు నాణేలను వారు పరిశీలించారు. నాణేంపై పడిన గీతలు పర్సుల్లో ఉంచడంతో నలగడం వల్ల ఏర్పడినవని నిర్ధారించి ఈ ఫలితాలను పీఎల్ఓఎస్ 1 జర్నల్‌లో పంచుకున్నారు.
వందల ఏళ్లుగా ఈ నాణేలు మట్టిలో పాతిపెట్టిన స్థితిలో ఉన్నట్లు రసాయన విశ్లేషణ ద్వారా తెలిసిందని మ్యూజియం క్యురేటర్, ఈప్రాజెక్టులో పియర్సన్తో కలిసి పనిచేసిన జెస్పర్ ఎరిక్సన్ చెప్పారు.
BBC NEWSమైక్రోస్కోపు నుంచి చూస్తే చెలామణిలో ఉండగా నాణేంపై పడిన గీతలు కనిపించాయి
ఇప్పుడిక పరిశోధకులు స్పాన్సియాన్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది.
రోమన్ సామ్రాజ్యంలోని అత్యంత కష్టతరమైన, సుదూరంలోని డాసియా అనే ప్రావిన్సుకు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఒక మిలిటరీ కమాండర్ అని పరిశోధకులు భావిస్తున్నారు.
క్రీ.శ 260 కాలంలో రోమన్ సామ్రాజ్యం నుంచి డాసియా ప్రావిన్సుకు సంబంధాలు తెగిపోయినట్లు పురాతత్వ అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక మహమ్మారి, అంతర్యుద్ధం కారణంగా ఆ సామ్రాజ్యం చిన్నాభిన్నమైంది.
రోమన్ సామ్రాజ్యం నుంచి దూరం కావడంతో పాటు శత్రువులు చుట్టుముట్టడం, అంతర్యుద్ధం వంటి గందరగోళ పరిస్థితుల్లో డాసియా పౌరులను, మిలిటరీని కాపాడేందుకు స్పాన్సియాన్ తనంతట తానుగా చక్రవర్తి పీఠాన్ని అధిష్టించాడని జెస్పర్ చెప్పారు. క్రీ.శ 271-క్రీ.శ 275 మధ్య కాలంలో డాసియా ప్రావిన్సు ఖాళీ అయినట్లు ఆయన వెల్లడించారు.
''రోమన్ సామ్రాజ్యం నుంచి డాసియాకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. శత్రువులు చుట్టుముట్టడంతో మిలిటరీ, పౌరులను కాపాండేందుకు ఆయన డాసియా బాధ్యతలు తీసుకున్నారు. ప్రావిన్సులో ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నడిచేందుకు సొంత నాణేలను ముద్రించాలని వారు నిర్ణయించుకున్నారు'' అని జెస్పర్ వివరించారు.
BBC NEWSహంటేరియన్ మ్యూజియంలోని అల్మారాలో నాణేంను భద్రపరిచారు
రోమన్ సామ్రాజ్యపు నాణేలతో పోలిస్తే ఈ నాణేలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
''అంతర్యుద్ధం ఉన్నందున అసలు చక్రవర్తి ఎవరో వారికి తెలియకపోవచ్చు. వారికి కావాల్సింది సుప్రీం మిలిటరీ కమాండర్. అవసరమైన సమయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు'' అని ప్రొఫెసర్ పియర్సన్ చెప్పారు.
ఆ నాణేలు ప్రామాణికమైనవే అని గుర్తించిన తర్వాత పరిశోధకులు ట్రాన్సిల్వేనియాలోని సిబియులో ఉన్న బ్రూకెంతల్ మ్యూజియం పరిశోధకులను అప్రమత్తం చేశారు. ఆ మ్యూజియంలో కూడా స్పాన్సియన్ నాణేం ఉంది.
ఆ నాణేం ట్రాన్సిల్వేనియా హాబ్స్బర్గ్ గవర్నర్ బరోన్ శామ్యూల్ వోన్ బ్రూకెంతల్కు చెందినది.
బరోన్ చనిపోయే సమయంలో ఆ నాణేం గురించి అధ్యయనం చేస్తున్నారు.
బ్రూకెంతల్ మ్యూజియంలోని నిపుణులు కూడా అందరిలాగే ఆ నాణేన్ని నికిలీ నాణేం అని అనుకున్నారు. కానీ, యూకే పరిశోధనను చూసిన తర్వాత వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
0 Comments:
Post a Comment