డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ చెల్లింపులలో మరో కొత్త సౌకర్యం జత చేరింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి నూతన సదుపాయాన్ని ప్రారంభించింది.
ఈ కొత్త సేవ కింద వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేయడానికి అనుమతి పొందుతారు. క్రెడిట్ కార్డ్‌ను UPIతో లింక్ చేసిన తర్వాత, కస్టమర్ కార్డ్ స్వైప్ చేయకుండానే దానిని ఉపయోగించవచ్చు. ఏ దుకాణంలోనైనా QR కోడ్‌ని స్కాన్ చేసి, చెల్లింపులను సులభంగా చేయవచ్చు.
ఒక నివేదిక ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ 30 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని ఫిన్‌టెక్ కంపెనీ మైండ్‌గేట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. దీనిగురించి ఫిన్‌టెక్ కంపెనీ మైండ్‌గేట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ క్రెడిట్ కార్డ్ వృద్ధి చెందుతోందని, అయితే దాని వ్యాపారం 6 శాతం తగ్గిందన్నారు.
అటువంటి పరిస్థితిలో, ఈ సదుపాయం ఆమోదం పొందిన తర్వాత, ఈ వ్యాపారం ఊపందుకుంటుందన్నారు. మీరు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించాలనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
ఈ నూతన సేవను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన కొంతమంది ఖాతాదారులకు అందించింది. సెప్టెంబర్ 20, 2022న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ కస్టమర్‌ర్లకు రూపే క్రెడిట్ కార్డ్ ఉపయోగించే అవకాశం కలిగింది.
మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో BHIM యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
తర్వాత వినియోగదారులు 'క్రెడిట్ కార్డ్‌ను జోడించు' ఎంపికపై క్లిక్ చేయాలి. తరువాత మీరు రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవచ్చు. అనంతరం వినియోగదారు RuPay క్రెడిట్ కార్డ్‌లోని చివరి ఆరు అంకెలు, చెల్లుబాటు వివరాలను నమోదు చేయాలి.
దీంతో వినియోగదారు అతని/ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా OTPని వస్తుంది. ఈ OTPని నమోదు చేశాక వినియోగదారు కొత్త UPI పిన్‌ని సెట్ చేయాలి.
ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత RuPay క్రెడిట్ కార్డ్ UPIకి లింక్ అవుతుంది. దీనితో వినియోగదారులు ఆ కార్డును స్కాన్ చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
0 Comments:
Post a Comment