వీక్షకులను విస్మయానికి గురిచేసే తిమింగలం ఆకారంలో ఉన్న భారీ విమానం జాయ్ సిటీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం అక్కడి స్థానికులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులను సైతం ఎంతో ఆకట్టుకుంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ బెలూగా(నం.3) వద్ద ల్యాండ్ అయింది. కోల్‌కతా విమానాశ్రయం ఆదివారం ఉదయం సిబ్బంది విశ్రాంతి, ఇంధనం నింపుకునేందుకు భారత్‌లో ఇది ఆదివారం ల్యాండ్ అయ్యింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా విమానాశ్రయంలో ఈ భారీ ఎయిర్‌బస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తిమింగళం ఆకారంలో ఉన్న ఈ భారీ ఎయిర్‌బస్ బెలూగా విమానం ఫొటోలను కోల్‌కతా విమానాశ్రయం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా, ప్రపంచంలోని అతిపెద్ద విమానాలలో ఎయిర్‌బస్ బెలూగా (నం. 3) ఒకటి. ఈ విమానం భారీ క్యాబిన్ సాధారణ విమానం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఎయిర్‌బస్ ఏ300 బీ4-608 ఎస్‌టీ అనేది సూపర్ ట్రాన్స్‌పోర్ట్ విమానం.
విమాన భాగాలు, భారీ కార్గో రవాణా కోసం ఈ భారీ సైజు విమానాన్ని రూపొందించారు. ఈ విమానం దాదాపు ఆరు అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది. దీని రెక్కలు దాదాపు 45 మీటర్ల పొడవు ఉంటాయి.
విమానంలోని అంతర్గత భాగం 124 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 23 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని బరువు 86,500 కేజీలు.
ఈ భారీ విమానం 1996 నుంచి సేవలందిస్తోంది. 1999లో తొలిసారి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఈ ఏడాది మే నెలలో రెండోసారి రాగా, తాజాగా ఆదివారం మూడోసారి ఇక్కడ దిగింది. ఎయిర్‌బస్ సంస్థ తయారు చేసిన ఈ భారీ కార్గో విమానం ఇప్పటి వరకు 3,100 సార్లు గాల్లో ప్రయాణించింది.
0 Comments:
Post a Comment