నల్ల బియ్యంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు తెలుసా.
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వ్యవసాయ రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పాలి. ఈ క్రమంలోనే రైతుల సైతం సరికొత్త వంగడాలను పండిస్తూ ప్రజలకు ఆహార పదార్థాలుగా అందిస్తున్నారు.
అయితే దేశం మొత్తం ఎక్కువగా ఆధారపడే వరిలో కూడా సరికొత్త వంగడాలను పండిస్తున్నారు. ఈ క్రమంలోనే వరిలో నల్ల బియ్యం ఆరోగ్య ప్రయోజనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పాలి. నల్ల బియ్యంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కనుక తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే.
నల్ల బియ్యంలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నల్లబియ్యంలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటితోపాటు నియాసిన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, జింక్ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా నల్లబియ్యంలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి మనకు విముక్తి కలిగించేలా చేస్తుంది.
నల్లబియ్యంలో లభించే ఫ్లేవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ డయాబెటిక్ వ్యాధివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచి మన శరీరానికి అనుగుణంగా గ్లూకోజ్ ఉపయోగించుకోవడం కోసం అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు నల్ల బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మనం ప్రతిరోజు ఒకసారి ఈ బ్లాక్ రైస్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి 60 శాతం ఐరన్ 40% ఫైబర్ అందిస్తుంది.ఇక ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది.అదేవిధంగా మన శరీరంలోకి ప్రవేశించే హానికర బ్యాక్టీరియాలతో పోరాటం చేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ను బయటకు తొలగించడానికి ఇందులో ఉన్నటువంటి పోషకాలు దోహదం చేస్తాయి.
ఇక ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది తద్వారా కార్డియోవాస్కులర్ వ్యాధుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నల్ల బియ్యంలో ఉండే జియాక్సాంటిన్, లుటిన్.. కెరోటినాయడ్స్ ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తూ రక్తపోటు సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. బ్రౌన్ రైస్ తో పోలిస్తే బ్లాక్ రైస్ లో ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండా ప్రోటీన్లను అధికంగా కలిగి ఉంటుంది.
0 Comments:
Post a Comment