శ్రీమద్ భగవద్గీత. మనిషి సరైన మార్గంలో నడిపించే ఏకైక గ్రంథం. జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ పాఠాలను బోధిస్తుంది. శ్రీమద్ భగవద్గీత జ్ణానం మానవ జీవితానికి, జీవోనోపాధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మనిషి జీవితం మొత్తం తత్వశాస్త్రం, దానిని అనుసరించే వ్యక్తి ఉత్తమమైవారిగా పరిగణిస్తుంది. శ్రీమద్ భగవద్గీత మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాలను వివరిస్తుంది.
భగవద్గీత వాక్యాలను జీవితంలో అలవర్చుకుంటే మనిషి ఎంతో అభివృద్ధి సాధిస్తాడు. శ్రీకృష్ణుడు మనిషి పతనం ఎప్పుడు మొదలవుతుందో చెప్పాడు. శ్రీకృష్ణుని అమూల్యమైన బోధనలు ఏంటో తెలుసుకుందాం.
భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి ఇతరుల నుండి సలహా తీసుకోవడం ప్రారంభించినప్పుడే ఏ వ్యక్తికైనా పతనం ప్రారంభమవుతుందని చెప్పాడు.
మోసం:
నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు. కానీ అమాయకుడిని మోసం చేసినట్లయితే నీ వినాశనానికి అన్ని ద్వారాలు తెరుస్తుంది.
పాపంలో నిమగ్నం:
కొంతమంది తాము చేసేది పాపమని తెలిసి కూడా అదే తప్పు పదే పదే చేస్తుంటారు. ఇది పతనానికి దారితీస్తుందని భగవద్గీత చెబుతుంది.
ఇతరుల మద్దతు లభించనప్పుడు ఏడవకండి:
శ్రీ కృష్ణుడి ప్రకారం…మనకు ఎవరి సపోర్టు లేనప్పుడు మనం నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఎవరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా…దేవుడు ప్రతికష్ట సమయంలోనూ మనకు సపోర్టుగా ఉంటాడు.
దురాగతాలు:
కష్టకాలంలో కూడా చిరునవ్వుతో ఉండాలని గీత చెబుతోంది. మనకు ఎవరైన ద్రోహం చేస్తే..ప్రతీకారం తీర్చుకోకుండా సహనంతో ఉండాలని చెబుతోంది.
అహంకారము:
శ్రీ కృష్ణుడు మనిషి ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదని చెప్పాడు. అహం అనేది ఒక వ్యక్తి జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అహం మనిషిని సరికాని ప్రతి పనికి పురికొల్పేలా చేస్తుంది. చివరికి ఈ అహంకారమే నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి జీవితంలో వీలైనంత త్వరగా మీరు అహాన్ని వదులుకోవడం మంచిది.
0 Comments:
Post a Comment