టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా గెలవగానే అంపైర్లను కొనేశారంటూ పాక్ ఆటగాళ్లు విమర్శలు చేశారు. ఇలా ఆరోణలు రావడం ఇదేం కొత్తకాదు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ.
అందుకే టీమిండియాకు అనుకూలంగా ఏం జరిగినా దాన్ని డబ్బుతో ముడిపెట్టేస్తుంటారు దాయాదులు. మిగతా క్రికెట్ బోర్డులు, మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐకి వ్యతికేరంగా మాట్లాడేందుకు ఆలోచిస్తారు. దానికి కూడా కారణం అదే.
ఎంత డబ్బు ఉంది?
మరి ప్రంచ క్రికెట్‌లో అతి సంపన్న బోర్డు అయిన బీసీసీఐ రెవెన్యూ ఎంతో తెలుసా? ఏడాదికి రూ.3730 కోట్లు. ఒక్క బీసీసీఐ వద్దనే ఇలా మూడు వేల కోట్లపైగా సంపద ఉంది. మిగతా బోర్డులు రెవెన్యూ పరంగా బీసీసీఐకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి.
ఐపీఎల్ విజయవంతం కావడంతో బీసీసీఐ ఖజానా భారీగా నిండుతూనే ఉంది. బీసీసీఐ తర్వాత సంపన్న క్రికెటో బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా. దీని రెవెన్యూ రూ.2,843 కోట్లు. అంటే ఈ రెండింటి మధ్య సుమారు వెయ్యి కోట్ల తేడా ఉందన్నమాట.
ఐపీఎల్ సక్సెస్ కారణం
ప్రపంచంలో అత్యంత సక్సెస్ అయిన క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ ఒకటి. తొలి టీ20 ప్రపంచకప్ జరిగిన మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ మొదలైంది. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడాలని కలలు కంటారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్, ఇంగ్లండ్ నిర్వహించే 'ది హండ్రెడ్' తదితర లీగులను ఐపీఎల్ సులభంగా దాటేసింది.
ఎంత మంది ఏమన్నాకానీ.. ప్రపంచంలో ఇదే అత్యంత బలమైన లీగ్. దీని వల్లనే ప్రపంచ క్రికెట్‌కు పలువురు క్రికెటర్లు పరిచయం అయ్యారు.
మిగతా బోర్డుల రెవెన్యూ ఎంతంటే?
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన బోర్డుల జాబితాలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఆ మరుసటి స్థానంలో రూ.2135 కోట్లతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిలిచింది.
అనంతరం కేవలం రూ.811 కోట్లతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నాలుగో ర్యాంకులో నిలిచింది. సుమారు రూ.802 కోట్లతో బంగ్లాదేశ్ జట్టు మరుసటి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత వరుసగా క్రికెట్ సౌతాఫ్రికా (రూ.425 కోట్లు), న్యూజిల్యాండ్ (రూ.210 కోట్లు), వెస్టిండీస్ (రూ.116 కోట్లు), జింబాబ్వే (రూ.113 కోట్లు), శ్రీలంక (రూ.100 కోట్లు) ఉన్నాయి.
0 Comments:
Post a Comment