ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
బెంగుళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ విగ్రహాన్ని కర్నాటక రాజధాని బెంగుళూరు మహానగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఏర్పాటు చేశారు.(Photo:Instagram)
కెంపెగౌడ విగ్రహాన్నిస్టాట్యూ ఆఫ్ ప్రాస్పెరిటీగా నామకరణం చేశారు. 108అడుగుల ఎత్తు 220టన్నుల బరువు కలిగిన కాంస్య విగ్రహాన్ని 85కోట్ల రూపాయలతో తయారు చేయించి ప్రతిష్టించారు. ప్రారంభోత్సవానికి ముందే ఈ విగ్రహం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది.(Photo:Instagram)
ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సెకండ్ టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. ఐదు వేల కోట్లతో నిర్మించబడిన ఈ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను బెంగుళూరు గార్డెన్ సిటీకి నివాళిగా రూపొందించారు. (Photo:Instagram)
విమాన ప్రయాణికులకు కొత్త అనుభూతితో పాటు గార్డెన్‌లో నడుస్తున్న ఫీలింగ్ కలిగేలా రూపొందించారు. పది వేల చదరపు మీటర్ల గ్రీన్ వాల్స్, హ్యాంగింగ్ గార్డెన్‌తో పాటు అవుట్ డోర్ గార్డెన్ గుండా ప్రయాణిస్తారు.(Photo:Instagram)
కెంపేగౌడ టెర్మినల్-2 లో ప్రయాణికుల నిర్వహణ సామర్ద్యం ప్రస్తుత సంవత్సరానికి 2.5కోట్ల నుంచి 5-6కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ కర్నాటక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 9.45గంటలకు బెంగుళూరులోని విధాన సౌధలో సెయింట్ పోయెట్ శ్రీకనకదాసు, మహర్షి వాల్మీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. (Photo:Instagram)
అటుపై బెంగుళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు నరేంద్ర మోదీ. అక్కడి నుంచి ఉదయం 11గంటలకు కెంపేగౌడ విమానాశ్రయం టెర్మినల్-2కి చేరుకుంటారు.(Photo:Instagram)
శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు అతి పెద్ద నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు బెంగుళూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. (Photo:Instagram)
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోయే బెంగుళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 2తో పాటు కాంస్య విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా మంత్రి తెలిపారు. (Photo:Instagram)
బెంగుళూరు ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు దక్కుతుందని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తుందని కూడా తెలిపింది ప్రభుత్వం.(Photo:Instagram)
0 Comments:
Post a Comment