Bad Cholesterol Tips: ఉదయం పూట ఈ పొడిని పాలతో తాగితే.. చెడు కొలెస్ట్రాల్‌కు శాశ్వతంగా బైబై చెప్పొచ్చు..
Flaxseed And Cinnamon For High Cholesterol: ప్రస్తుతం కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు. అయితే వయసుల గల వారు కాకుండా యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరల్లో రక్తం పేరుకుపోయే అవకాశాలున్నాయి. దీంతో గుండె పోటు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇది రక్తాన్ని రక్తాన్ని తీవ్ర ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దీని వల్ల ప్రస్తుతం చాలా మందిలో రక్తపోటును పెంచి దీర్ఘకాలీక వ్యాధులను పెంచి ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ఆహారాపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది.
వీటి ద్వారా ఆహార పదార్థాల వల్ల చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే శరీరంలో కొలెస్త్రాల్ పరిమాణాలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం..
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆహారంలో దాల్చిన చెక్కను తీసుకుంటే కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని మిక్సీ గ్రైండర్లో బాగా గ్రైండ్ చేసి గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలలో వేసుకుని తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అవిసె గింజలు:
అవిసె గింజల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో శరీర కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా..శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని పొడిలా చేసి.. ప్రతి రోజూ పాలలో వేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది.
0 Comments:
Post a Comment