Back Pain Relief: నడుము, వెన్ను నొప్పుల నుంచి ఇలా 3 రోజుల్లో శాశ్వతంగా ఉపశమనం..
Back Pain Relief In 3 Days: పూర్వం వృద్ధాప్య దశలో ఉన్న వారికి మాత్రమే వెన్ను నొప్పులు నడుము నొప్పులు వచ్చేవి. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది వెన్నునొప్పులతో బాధపడుతున్నారు.
సాధారణ వెన్నునొప్పులు ఉన్నవారు లేవడం కూర్చోవడం పడుకోవడం ఇబ్బందికరంగా మారొచ్చు. తీవ్ర నడుము నొప్పులు వెన్నునొప్పులు ఉన్నవారు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, ఇతర తీవ్ర సమస్యలు రావచ్చు. కాబట్టి వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు జీవన శైలిలో తప్పకుండా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
యువతకు ఎందుకు వెళ్ళినప్పుడు వస్తున్నాయి..?:
చాలామంది యువత ప్రస్తుతం శారీరిక శ్రమను తగ్గించుకుంటున్నారు దీంతో శరీరంలోని రక్త ప్రసరణ మందగించి.. శరీర దృఢత్వం కోల్పోయి వెన్నునొప్పుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఒత్తిడికి గురై వెన్నునొప్పుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది కుర్చీల్లో కూర్చొని అదే పనిగా గంటల తరబడి పనులు చేస్తూ ఉంటారు. దీని వలన కూడా వెన్ను నొప్పి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక యువకుల్లోనైతే ఏదైనా బుక్ చదివినప్పుడు వంకరగా పెట్టుకొని చదవడం వల్ల కూడా ఈ వెన్ను నొప్పులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వెన్నునొప్పుల నుంచి ఉపశమనం:
శీతాకాలంలో వెన్ను నొప్పులు రావడం చాలా సహజం. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు అల్లం టీ ని తాగాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి వెన్నునొప్పులను సులభంగా దూరం చేస్తాయని ఆరోగ్యంగా చెబుతున్నారు.
వెన్నునొప్పులకు పసుపు పాలు కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి. పసుపు పాలు చలికాలంలో ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి జలుబు దగ్గు సమస్యలు కూడా దూరం అవుతాయి. కాబట్టి వెన్నునొప్పులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు పసుపు కలిపిన పాలు తాగండి.
వెన్నునొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు యోగాసనాలు కూడా వేయాల్సి ఉంటుంది. యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. కాబట్టి ప్రతిరోజు యోగా చేయడం శరీరానికి ఎంతో మేలు.
0 Comments:
Post a Comment