గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా గలవారికి డాక్టర్లు తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ మాత్రలు వేసుకోవాలని సూచిస్తుంటారు.
రక్తాన్ని పలుచగా చేసే ఇవి ఎంతో మేలు చేస్తాయి. కానీ అరుదుగా కొందరికి జీర్ణాశయంలో పుండ్ల నుంచి రక్తస్రావం కావొచ్చు. ఈ పుండ్లు సాధారణంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ (హెచ్. పైలోరీ) అనే బ్యాక్టీరియాతో ఏర్పడుతుంటాయి.
మరి దీన్ని తొలగిస్తే రక్తస్రావం ఆగుతుందా? నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ప్రయత్నమే చేశారు. హెచ్. పైలోరీ పాజిటివ్‌గా ఉండి, దీర్ఘకాలంగా ఆస్ప్రిన్ మాత్రలు వేసుకుంటున్న వారిపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు.
వీరికి వారం పాటు యాంటీబయాటిక్ మందులను ఇవ్వగా.. ఆస్ప్రిన్ వాడకంతో జీర్ణాశయంలో రక్తస్రావమయ్యే ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు.
మున్ముందు రక్తస్రావం మూలంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవాల్సిన అవసరమూ తగ్గుముఖం పడుతుండటం విశేషం.
గుండెపోటు, పక్షవాతం నివారణకే కాదు.. ఆస్ప్రిన్ కొన్నిరకాల క్యాన్సర్లు త్వరగా వృద్ధి చెందకుండానూ కాపాడుతుంది.
కాబట్టి ఆస్ప్రిన్‌ను సురక్షితంగా వాడుకునే విషయంలో తాజా అధ్యయన ఫలితాలు ఎంతగానో ఉపయోగపడగలవని భావిస్తున్నారు.
0 Comments:
Post a Comment