APPSC Group 1 Application: గుడ్ న్యూస్, 'గ్రూప్-1' దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 92 పోస్టులకు అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే నవంబరు 2 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అనుమతి ఇచ్చింది. అయితే ఈ గడువును పొడగిస్తూ తాజాగా కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 5 వరకు దరఖాస్తు గడువును పొడగించింది. అభ్యర్థులు నవంబరు 4న రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి నవంబరు 2తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే మరో 3 రోజులపాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఇదిలా ఉండగా.. 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ఏపీపీఎస్సీ తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న 'గ్రూప్-1' స్క్రీనింగ్ పరీక్షను, వచ్చే ఏడాది మార్చి రెండో వారంలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
దరఖాస్తు ఫీజు:అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
0 Comments:
Post a Comment