ఆకలి లేకపోవడమనేది ఓ సాధారణమైన సమస్యే అయినా నిర్లక్ష్యం మంచిది కాదు. చిన్నారుల్లో, వృద్ధుల్లో ఎక్కువగా కన్పించే ఈ సమస్య ఇటీవలికాలంలో మధ్య వయస్సువారికి కూడా వస్తుంటుంది.
ఈ సమస్యకు కారణమేంటి, పరిష్కారం ఏముందనేది తెలుసుకుందాం..
ఆకలి మందగించడం లేదా ఆకలి లేకపోవడం..ఈ రెండు సమస్యల్ని అంత తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు వైద్యులు. ఈ సమస్య ఎక్కువగా కన్పించేది చిన్నారులు, వృద్ధుల్లో. సరైన ఆహారం తినకపోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా శరీరంపై పడుతుంది. పోషక పదార్ధాల లేమి తలెత్తుతుంది.
ఏ చిన్న పని చేసినా వెంటనే ఆలసిపోతుంటారు. బరువు కూడా గణనీయంగా తగ్గుతుంటుంది. ఈ పరిస్థితుల్లో తిరిగి కోలుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. లేకుంటే క్రమంగా బలహీనపడిపోతారు. శరీరానికి ప్రధానంగా కావల్సిన జింక్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది.
జింక్ ప్రయోజనాలు
శరీరంలో జింక్ అనేది ఒక ప్రత్యేకమైన న్యూట్రియంట్. ఇది చాలా అవసరం. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచేందుకు, చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆకలి లేమి సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు జింక్ సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి.
జింక్ లోపముంటే కన్పించే లక్షణాలు
ఆకలి లేమి, బరువు తగ్గడం, బలహీనత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, డయేరియా, హెయిర్ ఫాల్, గాయాలు ఆలస్యంగా మానడం, రుచి, వ్యర్ధాలకు తేడా తెలియకపోవడం
ఏ ఆహారం తీసుకోవాలి
ఆరోగ్యానికి పెరుగు చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా.. జింక్ కొరత దూరమౌతుంది. జీడిపప్పు ఆరోగ్యానికి చాలా బలవర్దకమైన ఆహారం. ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
తెల్ల శెనగల్లో కూడా జింక్ తగిన మోతాదులో ఉంటుంది. జింక్‌తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తెల్ల శెనగలు తినడం శరీరంలో జింక్ లోపం తొలగిపోతుంది. పుచ్చకాయ విత్తనాల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది.
0 Comments:
Post a Comment