AP weather report - బీ అలెర్ట్..మూడు రోజుల పాటు వర్షాలు..
ఆదివారం నుంచి ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్తున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రభావంతో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు 40-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
0 Comments:
Post a Comment