AP Rains: కూల్ న్యూస్.. ఏపీకి మూడు రోజులు మోస్తరు వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంద్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే ఈ ద్రోణీ వల్ల ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలతో తూర్పు/ఈశాన్య గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. మరోవైపు 26వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని.. మరో అల్పపీడనం వచ్చేవరకు ఇదే కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు రోజులు ఉదయం పొగమంచు కురుస్తుందని చెప్పారు.
రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:
—————————————————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————————————————————————————————-
ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశముంది.
రాయలసీమ:-
—————————————————————————————————————————-
మంచు దుప్పటిలో తెలుగు రాష్ట్రాలు..
తెలుగు రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఏపీలో… తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలను మంచు కమ్మేస్తోంది. ఉదయం తొమ్మిది దాటుతున్నా విశాఖ, అరకు లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో సూర్యుడి దాఖలాల్లేవు. ఇక తిరుపతి జిల్లా గూడూరులో మంచు కారణంగా హైవే పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచు కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మంచుతో వాహనదారులకు రోడ్డు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు సైతం జరుగుతున్నాయి. తిరుపతి గూడూరు, నెల్లూరులలో మంచుకారణంగా వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో రోడ్డుమీదకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్(యు)లో….భారీగా మంచుకురుస్తోంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్(యు)లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
0 Comments:
Post a Comment