AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖలోని పలు ఉద్యోగాలను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిరుద్యోగులు శుభవార్త ఇది. వికలాంగుల సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పలు బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 49 బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. డిసెంబర్ 6 దరఖాస్తు చేసేందుకు చివరి తేదీగా ఉంది. ఖాళీగా ఉన్న 49 బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
జూనియర్ అసిస్టెంట్ 6
జూనియర్ ఆడిటర్ 1
టైపిస్ట్ 2
టైపిస్ట్ కం స్టెనో 1
ఎంపీహెచ్‌ఏ 1
హెల్త్ అసిస్టెంట్ 1
మెటర్నిటీ అసిస్టెంట్ 1
బోర్‌వెల్ ఆపరేటర్ 1
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 9
షరాఫ్ 1
ఆఫీస్ సబార్డినేట్ 7
వాచ్మెన్ కమ్ హెల్పర్ 1
జూనియర్ స్టెనోగ్రాఫర్ 1
వెటర్నరీ అసిస్టెంట్ 1
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 1
వాచ్‌మెన్ 3
నైట్ వాచ్‌మెన్ 2
బంగ్లా వాచ్‌మెన్ 1
కమాటి 2
స్కావెంజర్ 1
స్వీపర్ 1
పీహెచ్ వర్కర్ 1
యుటెన్సిల్ క్లీనర్ 1
బేరర్ 1
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలకు ఏపీ ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్ పరిశీలించాలి.
0 Comments:
Post a Comment