Antarctica: అంటార్కికా ఖండం అంటే మనకు ఏం గుర్తుకొస్తుంది. దట్టంగా పేరుకుపోయిన మంచు.. మైనస్ ఉష్ణోగ్రతలు.. దుర్భరమైన వాతావరణం.. అలాంటి ఖండంలో మనుషులు పుట్టడం సాధ్యమేనా..
ఒకవేళ పుట్టినా బతికి బట్ట కట్టగలరా.. చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. కానీ 1978 జనవరిలోనే అంటార్కిటికా ఖండంలో తొలి జననం నమోదయింది.
1977 మొదట్లో చిలి అధినేత పినో చెట్ అంటార్కిటికాలో ఏర్పాటుచేసిన తమ దేశ పరిశోధన కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి.. ఆయా ప్రాంతాలు మావేనని ప్రకటించారు.
మరోవైపు అర్జెంటీనా అదే ఏడాది చివరిలో సిల్వియా మొరెల్లో డి పాల్మా అనే ఏడు నెలల గర్భిణి ని ఎస్పరాంజా బేస్ కు పంపింది. ఆమె 1978 జనవరి 7న ప్రసవించింది. ఇదే అంటార్కిటికా ఖండంలో తొలి శిశువు జననం.
దీని తర్వాత చిలి దేశం మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా పెళ్లయిన జంటలను ఆర్కిటికాలోని తమ బేస్ కు పంపింది.. అక్కడ వారు కాపురం చేసి, పిల్లలను కన్నారు. ఆ తర్వాత కూడా ఇది కొనసాగింది.
అర్జెంటీనా, చిలీ దేశాలు పెళ్లైన జంటలు, గర్భిణులను అంటార్కిటికాలోని తమ బేస్ లకు తరలించాయి. ఇలా కొన్నేళ్లలో మొత్తంగా 11 మంది అంటార్కిటికాలో పుట్టారు.
Antarctica
అర్జెంటీనా చీలిల ప్రయత్నాలను ప్రపంచ దేశాలు తప్పు పట్టడం, మంచు ఖండంపై ఏ దేశానికీ హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా మంచు ఖండంలో పిల్లల్ని కనేలా చేయడం వంటి ప్రయత్నాలు చేయలేదు.
ఈ మంచు ఖండంలో క్లిష్టమైన వాతావరణం ఉంటుంది. రాక పోకలు సాగించాలంటే కూడా కష్టం. ప్రసవం సమయంలో ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు. ఈ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరగడం, పుట్టిన 11 మంది కూడా ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం గమనార్హం.
ఇప్పుడు పరిశోధన కేంద్రాలు మాత్రమే ఉన్నాయి
భూమ్మీద ఉన్న ఖండాలలో ఒక అంటార్కిటికా మాత్రమే మంచుతో ఉంటుంది. కొన్ని దేశాలు వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం ఏర్పాటు చేసుకున్న పరిశోధన కేంద్రాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి.. ఇక్కడ ఉన్న క్లిష్టమైన వాతావరణం కారణంగా ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలానికి తిరిగి వచ్చేస్తుంటారు. వేరే వాళ్ళు వెళుతూ ఉంటారు. అంతేకానీ అంటారు మానవ శాశ్వత నివాసాలు ఉండవు.
Antarctica
మంచు ఖండం ఏ దేశానికి కూడా చెందినది కాదు.. కానీ ఫ్రాన్స్, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, నార్వే, యూకే, చిలి వంటి దేశాలు అంటార్కిటాకా లోని కొన్ని ప్రాంతాలు తమవేనని ప్రకటించుకున్నాయి.. అయితే దీనికి అంతర్జాతీయ గుర్తింపు లేదు.
వాస్తవానికి మంచు కండలోని ఏ ప్రాంతంలోకి ఏ దేశమైనా వెళ్లి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా వెళ్లవచ్చు.
అయినప్పటికీ కొన్ని దేశాలు ఇప్పటికీ తగ్గడం లేదు.. మిగతా వాటితో పోలిస్తే మంచు ఖండానికి దగ్గరలో ఉన్న చిలీ, అర్జెంటీనా, యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటికా పై ఎక్కువ దృష్టి పెట్టాయి. ఈ మూడు దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతం చాలా వరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
0 Comments:
Post a Comment