మీరు తరచూ విమాన ప్రయాణం చేస్తుంటారా.? వరల్డ్ టూర్స్‌కి వెళ్తుంటారా.? ఆయా విమానాలపై విమానసంస్థ లోగో, ట్రేడ్ మార్క్‌లను మీరు గమనించి ఉండొచ్చు.
కాని ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విమానాలన్నీ ఎందుకు తెలుపు రంగులో ఉన్నాయని ఆలోచించారా.? ఈ మధ్యకాలంలో చాలా విమానయాన సంస్థలు తమ విమానాలకు వేర్వేరు రంగులు, ఆకృతులను ఉపయోగిస్తున్నారు.
అయితే తయారీ సమయంలో చాలా విమానాలు ఇప్పటికీ తెలుపు రంగులోనే పెయింట్ చేయబడుతున్నాయి. ఎందుకంటారు.?
మొదట్లో విమానాలకు అన్ని రకాల రంగులను ఉపయోగించేవారు. పెయింట్ లేకుండా విమానాలను రూపొందించడానికి తయారీదారులు మెటల్ లేదా క్రోమ్‌ను ఉపయోగించడం ప్రారంభించప్పుడు విషయాలు మారాయి.
అయితే వారు అనుకున్నట్లుగా జరగలేదు.. రెక్కలకు త్వరగా మురికి, దుమ్ము, తుప్పు పట్టేవి. అప్పుడే విమానయాన సంస్థలు ప్రయాణీకుల నుంచి మంచి ఇంప్రెషన్ పడేందుకు తమ విమానాలను లేత రంగులలో, ఎక్కువగా తెలుపు రంగులో పెయింట్, పాలిష్ చేయడం ప్రారంభించారు. అయితే తెలుపు రంగు కేవలం ఇందుకే పరిమితమైందా.?
శాస్త్రీయ, ఆర్థిక కోణాల్లో విమానాలకు తెలుపు రంగు ఉత్తమమైనదిగా పరిగణిస్తున్నారు. ఇతర రంగులు సూర్యకాంతిని గ్రహిస్తాయి. తద్వారా విమానం బాడీ ఉష్ణోగ్రత పెరుగుతుంది.
అయితే తెలుపు రంగు సూర్యకాంతిని ప్రతిబింబిస్తుంది. సౌర వికిరణం, వేడి ఈ రెండింటిని తెలుపు తగ్గిస్తుంది. మంచు, గాలి, వర్షం.. ఇలా ఏ ఉష్ణోగ్రత అయినా.. తెలుపు రంగు తక్కువగా వెలుస్తుంది.
మరోవైపు సోలార్ రేడియేషన్ ప్రభావం పడకుండా విమానాన్ని తెలుపు రంగు సంరక్షిస్తుంది. విమానం వేడెక్కకుండా.. రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అలాగే ఎండవేడి విమానాలపై పడకుండా తెలుపు రంగు కాపాడుతుంది. కాగా, విమానం రంగు తెలుపు అయితే.. ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే.. దాన్ని ఈజీగా గుర్తించవచ్చునట. దీంతో నిర్వహణ భారం తగ్గుతుందని అధికారుల అంచనా.
0 Comments:
Post a Comment