గుండు తెచ్చిన తంటా!.. ఉపాధ్యాయుడు సస్పెన్షన్
లోపాలను బయట పెట్టాడని.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్
» ఫేషియల్ యాప్లో
సమస్యలు పై
'ఆంధ్రజ్యోతి'లో కథనo
» మాస్టారును బాధ్యుడిని చేస్తూ విద్యాశాఖ చర్యలు
గుండు తెచ్చిన తంటా..!
ఉపాధ్యాయుడు ఆదినారాయణ (ఫైల్)
హిందూపురం, నవంబరు 23: వ్యవస్థలో లోపాలను సరి దిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన ప్రభుత్వం.. ఓ లోపాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ సమస్యపై 'ఆంధ్రజ్యోతి'లో కథనం ప్రచురి తమైనందుకే చర్యలు తీసుకుంటున్నామని సస్పెన్షన్ ఉత్త ర్వుల్లో పేర్కొంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సి పాలిటీ పరిధిలోని మేళాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్ఎన్ ఆదినారాయణ ఫేషియ ల్ యాప్లో సాంకేతిక సమస్యతో ఇబ్బంది పడ్డారు. యాప్ ఫేస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన.. ఆ తరువాత మొక్కులో భాగంగా గుండు కొట్టించుకున్నాడు. మీసాలు. తొలగించారు. జుట్టు, మీసం లేని కారణంగా ఆ తర్వాతి రోజు ముఖహాజరు నమోదు కాలేదు. విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు 'గుండు తెచ్చిన తంటా' శీర్షికన 'ఆంధ్రజ్యోతి'లో 8న కథనం ప్రచురిత మైంది. దీనిపై ఉపాధ్యాయుడికి 17న మెమో జారీచేశారు. ఆ వివరాలను పత్రికలకు తాము ఇవ్వలేదని ఆ ఉపాధ్యా యుడితో పాటు ఎంఈవో వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైనందుకే సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో డీఈవో మీనాక్షి పేర్కొన్నారు. యాప్ లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని ఏపీటీఎఫ్ పట్టణాధ్య క్షుడు అంజినమూర్తి పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment